వార‌సుడి కోసం జేసి కొత్త ప్ర‌ణాళిక‌లు

401

అనంత‌పురం జిల్లాలో ఎంపీ జేసిదివాక‌ర్ రెడ్డి వ‌ర్గం ఆయ‌న కాంగ్రెస్ పార్టీలో ఉన్న స‌మ‌యంలో ఆయ‌న వెంట అంద‌రూ ఉండేవారు.. అయితే ఆయ‌న ఎప్పుడు అయితే తెలుగుదేశం పార్టీలో చేరారో ఆ స‌మ‌యం నుంచి ఆయ‌న కేడ‌ర్ కాస్త క్ర‌మ క్ర‌మంగా త‌గ్గుతూ ఉంది అనే చెప్పాలి. త‌ర్వాత జిల్లాలో ఆయ‌న‌కు ఇచ్చే రెస్పెక్ట్ పార్టీ త‌ర‌పున త‌గ్గింది అని ఆయ‌న మ‌ద‌న‌ప‌డుతున్నారు..ఇటు జేసి త‌న వార‌సుడు ప‌వ‌న్ ను ఇప్పుడు ఎంపీగా అనంత‌పురం నుంచి అరంగేట్రం చేయించేందుకు ప్ర‌ణాళిక ర‌చిస్తున్నారు.. ఇటు చంద్ర‌బాబు టికెట్ ఇస్తే నిరభ్యంత‌రంగా పోటీ చేస్తాడు అని అత‌ని స‌త్తా ప్ర‌కారం ఓట్లు వ‌స్తాయి అని అంటున్నారు.

Image result for jc diwakar

ఇక అనంత‌పురం ఎంపీ టికెట్ తెలుగుదేశం త‌ర‌పున జేసి వ‌ప‌న్ కు అనేది తెలిసిందే.. ఇక ఈ ఎంపీ సెగ్మెంట్ ప‌రిధిలోకి వచ్చే నియోజ‌క‌వ‌ర్గాల‌ను అన్నింటిని త‌న గుప్పిట్లో పెట్టుకోవాలి అని అనుకుంటున్నారు… అందుకు అనుగుణంగా జిల్లాలో ప్ర‌ణాళిక ర‌చిస్తున్నారు గ‌తంలో జిల్లాలో అంతా రాజ‌కీయంగా యాక్టీవ్ గా ఉన్నా, ఇప్పుడు జేసి త‌న రాజ‌కీయాల‌కి ప‌రిమితులు పెట్టుకున్నారు అని అంటున్నారు ఆయ‌న కేడ‌ర్..

Related image

 

జిల్లాలో తెలుగుదేశం అధికారంలో ఉన్నా లేక‌పోయినా ప‌రిటాల హవా కొన‌సాగేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ త‌ర‌పున‌జేసి ఉన్నా ముందు నుంచి ఉన్న ప‌రిటాల ఫ్యామిలికే త‌గిన ప్ర‌యారీటీ ల‌భిస్తోంది… శ్రీరామ్ కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌నుండ‌టంతో ఇప్పుడు జేసి ప‌వ‌న్ ప‌రిటాల శ్రీరామ్ వ‌ర్గాలు రాజ‌కీయంగా ఒకే పార్టీలో త‌ల‌బ‌డే అవ‌కాశం ఉంది. సో ఎవ‌రి వ‌ర్గం విజ‌యం సాధిస్తుందో చూడాలి వ‌చ్చే ఎన్నికల్లో.
ఇక్క‌డ ఎవ‌రు గెలిచినా వారు రాజ‌కీయంగా కేడ‌ర్ ను ప్రాబ‌ల్యంగా పెంచుకుంటారు.. సో మిగిలిన వ‌ర్గం త‌మ వ‌ర్గాన్ని కాపాడుకోవ‌డానికి మాత్ర‌మే పార్టీలో ముందుకు వెళ్లే ప‌రిస్దితి ఉంటుంది.. గ‌తంలో కాంగ్రెస్ లో కూడా ఇలాంటి ప‌రిస్దితి ఇక్క‌డ ఉండేది.