జేసి పావులు క‌దుపుతున్నారు

445

త‌మ కేడ‌ర్ జిల్లా అంతా ఉండాలి అనేది కాంగ్రెస్ లో ఉన్నప్ప‌టి నుంచి జేసి ఫ్యామిలీ ఆలోచ‌న… అలాగే కాంగ్రెస్ పార్టీలో వారి హవా ఉండేది.. ఇక తెలుగుదేశంలోకి వ‌చ్చిన త‌ర్వాత వారి హవాకి బ్రేకులు ప‌డుతున్నాయి.. ఇక్క‌డ ప‌రిటాల ఫ్యామిలీ హవా న‌డుస్తోంది… దీంతో జేసి కూడా త‌న ఆలోచ‌న‌కు ప‌దును పెట్టారు.. ఇటు జిల్లాలో త‌న‌కు ఎటువంటి ప్ర‌యారీటీ ఇవ్వ‌డం లేదు అని ఇప్ప‌టికే జేసీ కారాలు మిరియాలు నూరుతున్నారు.. జిల్లా అధికారులు గ‌తంతో తాను ఏమి చెబితే అది చేసేవారు ఇప్పుడు ఆప‌రిస్దితి లేదు.

Image result for jc diwakar reddy

ఇక జేసి అనంత‌పురంలో రోడ్ల విస్త‌ర‌ణ పై ఎప్ప‌టి నుంచో ప‌ట్టుప‌డుతున్నారు… ఇటు ఎమ్మెల్యే ప్ర‌భాక‌ర్ చౌద‌రితో పొస‌గ‌ని వైనం.. పైగా గురునాథ‌రెడ్డిని పార్టీలోకి తీసుకువ‌చ్చిన త‌ర్వాత జేసి పై మ‌రింత ర‌గిలిపోతున్నారు ప్ర‌భాక‌ర్ చౌద‌రి.. అనంత‌లో తిల‌క్ రోడ్డు గాంధీబ‌జార్ విస్త‌ర‌ణ జేసి కోరుకున్నారు అదీజ‌రుగ‌లేదు..గుంతకల్లులో మాజీ ఎమ్మెల్యే మధుసూదన్‌ గుప్తాను టీడీపీలో చేర్చుకోవాలి అని భావించారు అదీ జ‌రుగ‌లేదు…మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డికి అహుడా ఛైర్మన్ పదవి ఇవ్వాలి అని కోరారు దీనికి కూడా ఆయ‌న ఒకే చెప్ప‌లేదు.

Image result for jc diwakar reddy

ఈ స‌మ‌యంలో గుర్నాథరెడ్డి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్‌ను కలిశారు.. ఆయన ఏం చ‌ర్చించారా అని ఇప్పుడు పెద్ద చ‌ర్చ జ‌రుగుతోంది. ఆయ‌న పార్టీ మార‌తారు అని వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో తాజాగా భేటీ అవ‌డం చ‌ర్చ‌కు దారితీస్తోంది.. అయితే జేసి ఆయ‌న‌తో చ‌ర్చించ‌మ‌ని అన్నారు అని కూడా కొంద‌రు చెబుతున్నారు.. అహుడా చైర్మ‌న్ ప‌ద‌వి ఆయ‌నకు ఇచ్చేలా మంత్రి లోకేష్ తో చ‌ర్చించారు అని తెలుస్తోంది… మా పార్టీ నాయ‌కుడు కాబ‌ట్టి ఆయ‌న‌తో చ‌ర్చించాను అని తెలియ‌చేశాడు గుర్నాథ‌రెడ్డి …సో ఇప్పుడు సీఎం చంద్ర‌బాబు నిర్ణ‌యం పై లోకేష్ ఎటువంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి.