బ్రేకింగ్ న్యూస్ జేసి కుమారుడికి లైన్ క్లియ‌ర్

560

జేసి ప‌వ‌న్ రెడ్డి ఇప్పుడు అనంత‌పురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ త‌ర‌పున ఎంపీగా వినిపిస్తున్న పేరు.. ఆయ‌న జేసి దివాక‌ర్ రెడ్డి త‌న‌యుడు.. ఇక తండ్రి వార‌స‌త్వం అందిపుచ్చుకుంటున్న నేత.. ఇటు ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో ప‌వ‌న్ కు తెలియ‌ని వారు లేరు అంటే ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే.. ఆయ‌న నాయ‌కుడిగా ఎదగాల‌ని టీడీడీ అందుకు వేదిక అవుతుంది అని భావిస్తున్నారు.. అనంతపురం నేతగా రాజ‌కీయంగా జిల్లాలో ఆయ‌నకు ఫేమ్ ఉంది.. ఇటు వ్యాపారప‌రంగా హైద‌రాబాద్ బెంగ‌ళూరులో బిజీగా ఉంటారు.. ఇటు స‌ల్మాన్ నుంచి మెగా ఫ్యామిలీ వ‌ర‌కూ ఆయ‌న‌కు అంద‌రూ మిత్రులే.. గ‌త ఎన్నిక‌ల్లో అనంత‌పురంకు ప‌వ‌న్ ని పిలచి తండ్రి కోసం ప్రచారం చేయించారు అంటే తెలుసుకోవ‌చ్చు ఆయన స్టామినా ఏంటో.

Related image

ఇక ఆయన రాజ‌కీయంగా తెలుగుదేశం పార్టీలో అనంత‌పురం జిల్లా నుంచి ప‌లు స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తున్నారు.. ఇటు అనంత‌పురం నుంచి వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న ఎంట్రీ షురూ అని ఇటు పార్టీలో కూడా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి ..అటు బాబాయ్ తాడిప‌త్రి ఎమ్మెల్యే జేసి ప్ర‌భాక‌ర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డి కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాడిపత్రి నుంచి పోటీ చేయ‌నున్నారు అని వార్త‌లు వ‌స్తున్నాయి …ఈ స‌మ‌యంలో ఇద్ద‌రు అన్న‌ద‌మ్ములు వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ రాజ‌కీయ ఎంట్రీలు ప‌క్కా చేసుకుంటున్నారు.

Related image

ఇక ఎంపీ జేసి దివాక‌ర్ రెడ్డి రాజీనామా అంశం తెర‌పైకి వ‌చ్చిన ప్ర‌తీ స‌మ‌యంలో జేసి ప‌వ‌న్ అంశం తెర‌పైకి వ‌స్తోంది.. తాజాగా జేసి తాను పార్ల‌మెంట్ కు వెళ‌తాను అని చెప్పి వెళ్లిన త‌ర్వాత, మ‌ళ్లీ ఈ వివాదాలు వార్త‌లు వైర‌ల్ అవ్వ‌డం ఆగిపోయాయి.. అయితే ఇటు మంత్రి నారా లోకేష్ కు అలాగే సీఎం చంద్ర‌బాబు కు కూడా జేసి ఇప్ప‌టికే త‌న కుమారుడు వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌నున్నారు అని, టికెట్ అత‌నికి ఇవ్వాలి అని తెలియ‌చేశారు..

Related image

దీంతో తెలుగుదేశం అధినేత కూడా ప‌వ‌న్ కు గ్రీన్ సిగ్న‌ల్ ఇటీవ‌ల ఇచ్చారు అని తెలుస్తోంది… మాజీ ప్ర‌భుత్వ ఉద్యోగి, వీఆర్ ఎస్ తీసుకుని ప్ర‌భుత్వ ఉద్యోగం వ‌దిలిని. పీడీ రంగ‌య్య‌కు వైసీపీ సీటు ఇచ్చే అవకాశం ఉంది …ఇప్పుడు అనంత వైసీపీ బాధ్య‌త‌లు ఆయ‌న చూసుకుంటున్నారు. అనంత పొలిటిక‌ల్ కారిడార్లో జేసి వార‌సుడా… పీడీ రంగ‌య్య‌నా అనేది తెలియాల్సి ఉంది మ‌రికొన్ని రోజుల్లో.