జేసి ప‌వ‌న్ కు చుక్క‌లు చూపించిన జ‌నం

389

తెలుగుదేశం ఎంపీ జేసి దివాక‌ర్ రెడ్డి ఫ్యామిలీ వార‌సులు ఇప్పుడు రాజ‌కీయాల్లోకి రావాలి అని అనుకుంటున్నారు.. ఈ స‌మయంలో వారు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు చాలా ఉంటాయి..నాయ‌కుల‌తో పాటు ప్ర‌జ‌లతో కూడా స‌యోధ్య‌గా ఉండాలి.. వారి స‌మ‌స్య‌లు తెలుసుకుంటూ ముందుకు వెళ్లాలి.. కాని ఇప్పుడు ప‌రిస్దితి అలా లేదు, తాజాగా అనంత‌పురం ఎంపీ జేసి దివాక‌ర్ రెడ్డి త‌న‌యుడు ప‌వ‌న్ రెడ్డి చాలా దురుసుగా ప్ర‌వ‌ర్తించారు.

Image result for jc pawan

విష‌యం ఏమిటి అంటే… అనంత‌పురం జిల్లాలోని శింగనమల నియోజకవర్గంలోని గార్లదిన్నె మండలం మార్తాడు గ్రామంలో పర్యటించిన ఆయన్ని గ్రామస్తులు సమస్యలపై నిలదీశారు… దీంతో ఒక్క‌సారిగా ఆయ‌న కంగుతిన్నారు. ఇంటికో ఉద్యోగం హామీ ఏమైందని, నాలుగున్నరేళ్లలో నెరవేర్చని హామీలు 4 నెలల్లో ఎలా నెరవేరుస్తారని ప్రశ్నించారు… దీంతో ఆగ్రహానికి గురైన పవన్‌ రెడ్డి వారిపట్ల దురుసుగా ప్రవర్తించారు… సహనం కోల్పోయి ఎవరికో ఓట్లు వేసి మమ్మల్ని అడిగితే ఎలా అంటూ అసభ్య పదజాలంతో దూషించారు. తను చెప్పింది మాత్రమే వినాలంటు హెచ్చరించారు. పవన్‌ రెడ్డి తీరుపై ఆ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తు‍న్నారు.

Image result for jc pawan

ఇక ఈ స‌మయంలో తండ్రి రాజ‌కీయంగా పేరు తెచ్చుకున్నారు.. ఈయ‌న మాత్రం ఇంకా ఎన్నిక‌ల్లోకి రాకుండానే ఇటువంటి ప‌రుష దూష‌ణ‌లు ఆగ్ర‌హాలు ఏమిటి అని నిల‌దీస్తున్నారు… పైగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ క‌చ్చితంగా త‌న‌కే అని చెబుతున్న ఆయ‌న, ఇప్పుడు ప్ర‌జ‌ల్లో ఇలాంటి నెగిటీవ్ షేడ్ తో వెళ‌తారా అని ప్ర‌శ్నిస్తున్నారు.