జేసీ వ‌ర్గం మ‌రో సంచ‌ల‌నం

362

అనంతపురం జిల్లా తాడిప‌త్రి ర‌ణ‌రంగంగా మారుతోంది.. రెండు రోజులుగా వినాయ‌క నిమ‌జ్జ‌నం నుంచి స్టార్ట్ అయిన ఈ వివాదం, చిలికి చిలికి గాలివాన‌లా మారింది…. ప్రభోదానందస్వామి వర్గీయులు, గ్రామస్తుల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు చనిపోగా మరో 45 మందికి గాయాలు అయ్యాయి. వారిలో సీఐతోపాటు పది మంది పోలీసులు కూడా ఉన్నారు… గ్రామస్తులపై దాడికి దిగిన ప్రభోదానందస్వామి వర్గంపై చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేస్తూ, నిన్నటి నుంచి టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పోలీస్ స్టేషన్ ముందు భైఠాయించి నిరసన తెలుపుతున్నారు.

Image result for jc diwakar reddy fought to prabodanadha followers

ఇక ఎంపీ జేసి దివాక‌ర్ రెడ్డి రంగంలోకి దిగ‌డంతో ఇటు ఆయ‌న అనుచ‌రులు కూడా పెద్ద ఎత్తున అక్క‌డ చేరుకుంటున్నారు.. ఇక్క‌డ నుంచి ప్ర‌భోదానంద పై చ‌ర్య‌లు తీసుకోక‌పోతే వెళ్లేది లేదు అంటున్నారు, ఇక తాడిప‌త్రి పోలీసులు, జిల్లా పోలీసులు భారీగా ఇక్క‌డ మోహ‌రించారు.. చిత్తూరు జిల్లా అనంత‌పురం జిల్లా ఎస్పీలు ఎప్ప‌టిక‌ప్పుడు ఇక్క‌డ ప‌రిస్దితిని చూస్తున్నారు, ఇరువురి మ‌ధ్య జ‌రిగిన గొడ‌వ‌లు స‌ర్దుమ‌ణ‌గాలి అని జిల్లా క‌లెక్ట‌ర్ ఓ క‌మిటీ వేశారు.. అయినా స‌రే జేసి మాత్రం సంతృప్తి చెంద‌డం లేదు, దీంతో వివాదం మ‌రింత పెరిగింది అనే చెప్పాలి.

Image result for jc diwakar reddy fought to prabodanadha followers

ప్రభోదానంద వర్గీయులపై చర్యలు తీసుకుంటే తప్ప తాను వెళ్లేది లేదంటూ పీఎస్ ముందే బైఠాయించారు… దీంతో ఉద్రిక్తతలు మరింత పెరగకుండా ఎస్పీ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు… ఇక త‌మ‌పై కావాల‌నే ఆ గ్రామ‌స్తులు జేసీ వ‌ర్గీయులు దాడిచేశారు అని ఆ స్వామీజీ శిష్యులు గొడ‌వ‌ప‌డుతున్నారు. మొత్తానికి ఈ వివాదం చిలికి చిలికి వాన‌గా మారింది.