రెడ్డిగారికి క్లారిటీ ఉంది మ‌రి టీడీపీ అధినేత‌కు

356

ఇప్పుడు ఏపీలో తెలుగుదేశం పార్టీ వ‌చ్చేఎన్నిక‌ల్లో ఎవ‌రితో పొత్తు పెట్టుకుంటుంది అనేది పెద్ద చ‌ర్చ జ‌రుగుతున్న అంశం.. తెలుగుదేశం పార్టీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ పై గెలుపొందేందుకు స‌ర్వ ప్ర‌య‌త్నాలు చేస్తోంది.. పార్టీ త‌ర‌పున సీనియ‌ర్లు జూనియ‌ర్లు అనే ఆలోచ‌న‌ కాకుండా గెలుపు గుర్రాలు ఎవ‌రు అనేది చూస్తున్నారు. ఆ కోణంలో టికెట్లు కేటాయించాలి అని చూస్తున్నారు.

Image result for jc diwakar reddy

అటు తెలంగాణ, ఇటు ఆంధ్ర్రప్రదేశ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం పార్టీ పొత్తుల ఉహాగానాలపై టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు…. ఆయన అమరావతిలో సీఎం చంద్రబాబును కలిశారు. మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో టీడీపీ బలహీనంగా ఉంది… కాంగ్రెస్ పార్టీ టీడీపీ మద్దతు కోరుతోంది… రాష్ట్రాన్ని దెబ్బ తీయడంలో అందరి పాత్ర ఉన్నప్పటికీ తెలంగాణలో కాంగ్రెస్‌కి మద్దతు ఇస్తే తప్పు లేదు..అని జేసీ అన్నారు. అలాగే తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితిలో టీడీపీ లేదని, ఆంధ్రాలో మాత్రం కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడం మంచిది కాదన్నారు.

Image result for jc diwakar reddy

ఇక ఇంట్లోకి వ‌స్తే ఓ రిలేష‌న్ ఇంటి బ‌య‌ట ఓ రిలేష‌న్ అని.. పొత్తుల పై తెలుగుదేశం పార్టీ అధినేత కాకుండా పార్టీ ఎంపీలు కూడా అలాగే మాట్లాడుతున్నారు అని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి… తెలంగాణ‌లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నా ప‌ర్వాలేదు కాని ఏపీలో కాంగ్రెస్ పార్టీలో పొత్తు అవ‌స‌రం లేద‌ని, ఇక్క‌డ నేరుగా విజ‌యం సాధిస్తామ‌ని చెబుతున్నారు జేసి. ఇటు ప్ర‌జ‌లు కూడా ఇక్క‌డ కాంగ్రెస్ పార్టీని హ‌ర్షించ‌రు అని అంటున్నారు.

Image result for jc diwakar reddy
గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇప్ప‌టికే బీజేపీని నమ్మి మోసపోయామని, అధికారంలోకి వస్తే ఏపీకి న్యాయం చేస్తామని కాంగ్రెస్ అంటోందని, కాంగ్రెస్‌ని నమ్మి చూస్తే తప్పేమీ ఉందంటూ ఆయ‌న వ్యాఖ్యానించారు. అలాగే విభజన పాపం కాంగ్రెస్, టీడీపీల రెండింటిది ఉందని, పొత్తుల విషయంలో ఎన్టీఆర్ నాటి పరిస్థితులు వేరు, ప్రస్తుత పరిస్థితులు వేరు అని దివాకర్‌రెడ్డి అన్నారు. ముందస్తు ఎన్నికలకు పోవడం కేసీఆర్ రాజకీయ కుయుక్తి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీతో టీఆర్ఎస్ పొత్తు ఉంటుందని అయితే… ముస్లింలు దూరం అవుతారనే అసెంబ్లీ ఎన్నికలకు ముందస్తుకు వెళుతున్నాడన్నారు. కేంద్రంలో అధికారం మారితేనే పోరాటాలకు ఫలితం ఉంటుందన్నారు జేసి….మ‌రి ఈ స‌మ‌యంలో తెలుగుదేశం ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు మాత్రం వెళ్లే ఆస్కారం సాహ‌సం లేదు అని తెలుస్తోంది ఇటు జేసి కామెంట్లు చూస్తుంటే.