నెల్లూరులో జ‌న‌సేనాని స్పీచ్

340

ప్ర‌జ‌ల‌పై ఇష్టంతో రాజ‌కీయాల్లోకి రావాలి అని అన్నారు జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్.. ఇకనెల్లూరులో జ‌రుగుతున్న రొట్టెల పండుగలో ఆయ‌న పాల్గొన్నారు.. న‌గ‌రంలో జ‌రుగుతున్న ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొని ఓ హోట‌ల్లో పార్టీ నాయ‌కుల‌తో ఆయ‌న చ‌ర్చ‌లు జ‌రిపారు.. నాకు ఇన్నికోట్ల మంది అభిమానులు ఉండి ప్ర‌తీ త‌ప్పుపై ప్ర‌శ్నిస్తున్నాను, కాని నేను ఏమీ మాట్లాడ‌క‌పోతే, ఈ స‌మాజానికి ఏమి చేసిన వాడిని అవుతాను చెప్పండి అని ప్ర‌శ్నించారు. నా మ‌న‌స్సాక్షికి తెలుసు నేను రాజ‌కీయంగా ఏమీ చేస్తున్నాను అని. ప్ర‌జా స‌మ‌స్య‌లు త‌ప్ప నాకు ఏమీ క‌నిపించ‌వు అని అన్నారు ఆయ‌న‌.

Image may contain: 8 people, people smiling, crowd and outdoor

మీ అంద‌రికి ఓ విష‌యం చెప్పాలి తాను సినిమాల్లోకి వ‌చ్చిన స‌మ‌యంలో ప్ర‌తీ సినిమా హిట్ అయిపోతుంది.. ఇంత మంది అభిమానులు వ‌స్తారు అని అనుకోలేదు. త‌న సినిమాలు న‌చ్చి ఇంత మంది అభిమానులు వ‌చ్చారు. అలాగే నాకు నేనుగా ఏదీ అనుకుని చేయ‌లేదు. స‌మ‌యంతో పాటు ఇలా జ‌రుగుతూ వ‌చ్చాయి. ఇటు రాజ‌కీయాల్లో కూడా నేను సీఎం అయిపోతాను అని చెప్పడం లేదు, కాని నేను మీకు అండ‌గా ఉంటాను త‌ప్పులు ఉంటే ప్ర‌శ్నిస్తాను అని అన్నారు ప‌వ‌న్ క‌ల్యాణ్ .

Image may contain: 5 people, beard

చిన్న‌త‌నం నుంచి దేశ భ‌క్తి గీతాలు వినే స‌మ‌యంలో, ఈ దేశానికి ఏమైనా చేయాలి అని అనుకున్నాను..అలాగే ఈ దేశానికి ఎంతో కొంత మంచి చేసే పనిలో ఉన్నాను అని అన్నారు ప‌వ‌న్ క‌ల్యాణ్.. తాను సినిమాలు చేసి సంవ‌త్స‌రానికి 25 కోట్ల రూపాయ‌ల పన్నుక‌డుతున్నాను.. స‌మాజం పై నాకు అవ‌గాహ‌న ఉంది.. ముఖ్యంగా పార్టీ కార్య‌క‌ర్త‌లు నిర్మాణంపై నాకు చాలా స‌హాయం చేస్తున్నారు. వారికి అంద‌రికి జ‌న‌సేన త‌ర‌పున ధ‌న్య‌వాదాలు తెలియ‌చేస్తున్నాను అని చెప్పారు ప‌వ‌న్ క‌ల్యాణ్.