రాజ‌కీయ నిరుద్యోగుల‌కు జ‌న‌సేన షెల్ట‌ర్

431

తెలుగుదేశం పార్టీలో సీనియ‌ర్లు ఉన్నారు.. వైసీపీలో సీనియ‌ర్లు ఉన్నారు.. కాని జ‌న‌సేన‌లో మాత్రం అంద‌రూ సినియ‌ర్లే ఉన్నారు.. ఇప్పుడు ఆ పార్టీని చూస్తుంటే రాజ‌కీయ నిరుద్యోగుల‌కు కేరాఫ్ అడ్ర‌స్ అయింది అని జ‌న‌సేన పార్టీ నాయ‌కులు అభిమానులు కూడా అంటున్నారు, అంంటే అర్ధం చేసుకోవ‌చ్చు.. ఎటువంటి ప‌రిస్ధితి ఆ పార్టీలో ఉందో.ఇక జ‌న‌సేన పార్టీలో ఉన్న రాజ‌కీయ నాయ‌కుల‌ను చూసిన‌ట్లు అయితే, మాదాసు గంగాధ‌రం, పంతం నానాజీ, చేగొండి హ‌రిరామ జోగ్యయ్య‌ వీరు అంద‌రూ పార్టీలో చేరి ప‌వ‌న్ కు 1965 స‌ల‌హాలు ఇస్తున్నారా 2018 స‌ల‌హాలు ఇస్తున్నారా అని నేత‌లు కూడా ప్ర‌శ్నిస్తున్నారు.

Image may contain: 2 people, people on stage and beard

వీరు అంద‌రూ రాజ‌కీయ నేత‌లు కాని ఇప్పుడు వీరంద‌రిని జ‌నం మ‌ర్చిపోయారు. పాత రాజ‌కీయ నాయ‌కులు అయిపోయారు.. పంతం గాంధీమోహ‌న్ ఈ రాజ‌కీయ నాయ‌కుడు కూడా ఈ లిస్టులో చేరిపోయారు.. ఇక న‌లుదిక్కులా ఈ పార్టీలో చూసినా కాపు పార్టీ అయిపోయింది అనే మార్క్ ప‌డిపోయింది… ఇక జ‌న‌సేన పై కాపు ముద్ర పోవాలి అని, ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌య‌త్నం చేస్తున్నా, అది ఆయ‌న‌కు స‌త్ఫ‌లితాలు చూప‌డం లేదు.

Image may contain: 18 people, people sitting

ఇక ఎక్కువ‌గా కాపు నేత‌లే జ‌న‌సేన తీర్ధం తీసుకుంటున్నారు అనేది తెలిసిందే.. దీంతో కాపు ఓటు బ్యాంకు మొత్తం జ‌న‌సేన‌వైపు మ‌ళ్లుతోంది అని అంటున్నారు.. మ‌రి ఇటు ప‌వ‌న్ మాత్రం ఇంకా ఇలా సీనియ‌ర్ల‌ను ప‌క్క‌న పెట్టుకుని ఎటువంటి రాజ‌కీయ ప్ర‌ణాళిక అమ‌లు చేస్తారో చూడాలి. మ‌రోవైపు ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా ఈ టీంని ఎటువంటి ప్ర‌ణాళిక‌ల‌కు ఉప‌యోగిస్తున్నారు అనేది, ఇటు జ‌న సైనికుల‌కు కూడా తెలియ‌ని ఓప్ర‌శ్న‌. మ‌రి యువ‌కులు ఎక్కువ‌గా ఉన్న ఈ పార్టీలో వారికి పెద్ద పీట వేయాలి అని అడుగుతున్నారు. మ‌రి అటువైపు ప‌వ‌న్ నిర్ణ‌యాలు ఏమైనా ఉంటాయా అనేది చూడాలి.