సిఎం కు అక్రమ పేలుళ్ళ గురించి తెలియదా..చంద్రబాబు కు పవన్ సూటి ప్రశ్న..!

423

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం కర్నూల్ జిల్లాలోని పేలుడు సంభవించిన హత్తి బెళగల్ క్వారీని సందర్శించారు…అక్కడి పరిస్థితిని చూసి చలించిపోయిన పవన్ ముఖ్యమంత్రి చంద్రబాబుకి కొన్ని ప్రశ్నలు సంధించారు..గ్రామాల్లో వీధి దీపాలు వెలగక పోయినా తనకు తెలుస్తుందనే సిఎం కు అక్రమ పేలుళ్ళ గురించి తెలియదా అంటూ సూటిగా ప్రశ్నించారు..రాష్ట్రంలో అడ్డగోలుగా అక్రమ మైనింగ్‌ జరుగుతోందని మండిపడ్డారు.

క్వారీల్లో ఇష్టారాజ్యంగా పేలుళ్లు చేస్తున్నా పట్టించుకోవడం లేదని, అక్రమక్వారీల్లో ప్రాణనష్టం జరిగేవరకు గనుల మంత్రి ఏం చేస్తున్నారని మరోసారి ప్రశ్నించారు. గనులశాఖ మంత్రి పడుకుని నిద్రపోతున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పు చేసిన టీడీపీ నేతలను చంద్రబాబు వెనకేసుకొస్తున్నారని దుయ్యబట్టారు…పేలుడు ప్రాంతాన్ని పూర్తిగా పరిశీలించే అవకాశం లేకుండా పోయింది. దీంతో కొద్ది పాటి ప్రాంతాన్ని మాత్రమే పరిశీలించి.. వివరాలు అడిగి తెలుసుకున్నారు. పవన్‌ను కనీసం ముందుకు కదలనీయకుండా అభిమానులు, పార్టీ కార్యకర్తలు చుట్టూ చేరారు. దీంతో అరకొర మాత్రమే పరిశీలించి పవన్ వెనుదిరిగారు.