ఆలూ లేదూ చూలు లేదూ..నేనే సిఎం అంటున్న పవన్ కళ్యాణ్..!

401

ప్రశ్నించడానికి పార్టీ పెట్టానని చెప్పి కాలక్రమేణా రూటు మార్చి నన్ను సిఎం చేయండంటూ ఓటర్లను వేడుకుంటున్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్..గత ఎన్నికల్లో టిడిపి బిజెపి కూటమికి మద్దతిచ్చి పరోక్షంగా వారి గెలుపుకు కారణమయిన పవన్ తాజా రాజకీయ పరిణామాలతో నన్ను గెలిపించండంటూ బహిరంగ సభల్లో వేడుకుంటున్నారు..ఇదంతా బాగానే ఉంది కాని..2019 ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాదించి అధికారాన్ని చేపట్టాలి…కాని ప‌వ‌న్ మాత్రం నేనే సీఎంనంటూ స్టేట్ మెంట్ ఇచ్చారు. ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌కు క‌ర్నాట‌క ఎన్నిక‌ల‌కు లింక్ ఉంద‌నే చెప్పాలి.

మొన్న జరిగిన కర్నాటక ఎన్నికల్లో మూడో స్థానంలో ఉన్న కుమారస్వామి సిఎం అయ్యారు కదా..ఆ విధంగానే తానూ కూడా ఇక్కడ సిఎం అవుతాననే పగటి కలలు కంటున్నారు మన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు..అయితే పార్టీ నిర్మాణం చూసుకుంటే జ‌న‌సేన‌ను స్థాపించి ఐదు సంవ‌త్స‌రాలు కావ‌స్తోంది.ఏదో గాలివాటుగా ఎప్పుడో ఒక‌సారి జ‌నాల్లోకి రావ‌టం మ‌ళ్ళీ కొద్ది రోజులు ఎక్క‌డుంటారో కూడా ఎవ‌రికీ తెలీకుండా ఎటో వెళ్ళిపోవ‌టం ఇంత‌కాలం ప‌వ‌న్ రాజ‌కీయం ఇలానే జ‌రిగింది.

మెగాస్టార్ చిరంజీవి సోదరునిగా సినీ నటుడిగా ఉన్నారు కాబట్టి మీడియా అంతో ఇంతో ప్రాధాన్యత ఇస్తోంది గాని లేకపోతే ఈ పాటికి ఎప్పుడో జనసేన పార్టీని మరచిపోయేవారు ప్రజలు..పార్టీ పెట్టి ఐదేళ్ళ‌యినా ఇంత వ‌ర‌కూ పార్టీ నిర్మాణ‌మే చేయ‌లేదు. పార్టీ మొత్తం మీద ప‌వ‌న్ త‌ప్ప ఇంకో నేతే క‌న‌బ‌డ‌రు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అస‌లు ఎన్ని సీట్ల‌లో జ‌న‌సేన పోటీ చేస్తుందో కూడా చెప్ప‌లేని ప‌రిస్థితుల్లో ఉంది పార్టీ. ఎన్నిక‌లు ప‌ది నెలల్లోకి వ‌చ్చేసినా ఇంత వ‌ర‌కూ జ‌న‌సేన త‌ర‌పున పోటీ చేసేది వీరే అంటూ జ‌నాలు చెప్పుకోవ‌టానికి ఏ జిల్లాలో కూడా నేత‌లు క‌న‌బ‌డ‌టం లేదు. ఇటువంటి ప‌రిస్ధితుల్లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు, జ‌గ‌న్ మ‌ధ్య జ‌రిగే పోరాటంలో ఏదో ఓ 30 సీట్లు గెలుచుకుంటే అదికూడా కాపులు ఎక్కువ‌గా ఉండే ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల్లో ఎక్క‌వ సీట్లు వ‌చ్చి కుమార‌స్వామి లాగ ఇక్క‌డ తాను సిఎం అయిపోవ‌చ్చ‌ని ప‌వ‌న్ అనుకుంటున్న‌ట్లుంది.