‘రాపాక ‘కు పవన్ షాక్

178

సార్వత్రిక ఎన్నికల షాక్ నుంచి తేరుకుంటోంది జనసేన పార్టీ. గతాన్ని మర్చిపోయి భవిష్యత్‌వైపుగా అడుగులు వేస్తోంది. ఇకపై పార్టీ బలోపేతంతో పాటూ ప్రజా ఉద్యమాలపై ఫోకస్ పెట్టింది. ఈ మేరకు విజయవాడలో పార్టీ నేతలతో సమావేశమైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. పార్టీ కమిటీల కూర్పుపై చర్చించారు. అనంతరం కమిటీల జాబితాను విడుదల చేశారు. దీనిలో భాగంగా పొలిట్‌ బ్యూరో, పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీ, క్రమశిక్షణా సంఘాన్ని ఏర్పాటు చేసింది. పవన్‌ కళ్యాణ్ అన్నయ్య, నర్సాపురం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన కొణిదెల నాగబాబుకు పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీలో అవకాశం కల్పించారు. అలాగే, జనసేన పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీ చైర్మన్‌గా తెనాలి నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిన నాదెండ్ల మనోహర్‌ని, పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్‌గా మాదాసు గంగాధరంను నియమిస్తూ ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పవన్‌ కల్యాణ్‌ రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. నాదెండ్ల మనోహర్‌తో పాటు రామ్మోహన్‌ రావు, రాజు రవితేజ్‌, అర్హంఖాన్‌లకు జనసేన పొలిట్‌ బ్యూరోలో చోటు కల్పించారు.

ఈ క్రింద వీడియోని చూడండి

అయితే, ఇక్కడ అసలైన ట్విస్టు ఏమిటంటే, పొలిట్‌ బ్యూరోలో జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌కు అవకాశం కల్పించకపోవడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఇక 11 మంది సభ్యులతో కూడిన పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీ సభ్యులను కూడా జనసేన అధినేత ఎంపిక చేశారు. జనసేన పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీ సభ్యులు : తోట చంద్రశేఖర్‌, రాపాక వరప్రసాద్‌, కోన తాతారావు, ముత్తా శశిధర్‌, పాలవలసి యశస్విని, పసుపులేటి యశస్విని,భరత్‌ భూషణ్‌, కొణిదెల నాగబాబు, కందుల దుర్గేష్‌, పసుపులేటి హరిప్రసాద్‌, మనుక్రాంత్‌ రెడ్డి, బి. నాయకర్‌. ఈ ఎంపికల్లో మరో ట్విస్టు కూడా ఉంది. జనసేన పొలిట్‌ బ్యూరోలో కానీ, పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీలో కానీ జేడీ లక్ష్మీనారాయణ గారి పేరు ఎక్కడా లేక పోవడం.

Image result for rapaka varaprasad

అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్‌ కళ్యాణ్‌ క్షేత్రస్థాయి పర్యటనలు చేపడతారని తెలిపారు. పర్యటనలకు సంబంధించి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని యువతను, అనుభవజ్ఞులైన నాయకులను కలుపుకొని ఈ పర్యటనలు కొనసాగుతాయన్నారు. క్షేత్ర స్థాయిలో సమస్యలను గుర్తించి వాటిని పరిశీలించడంతోపాటు ఏ విధమైన పంథాలో పరిష్కరించి ప్రజలకు ప్రయోజనం చేకూర్చాలి అనే దిశగా పవన్ ఈ పర్యటనలు చేపడతారన్నారు. ఈ పర్యటన ద్వారా పార్టీలో యువ నాయకత్వాన్ని బలోపేతం చేయడంతోపాటు.. వారిని సామాజిక, రాజకీయ కార్యకలాపాల్లో ఉత్తేజితం చేసి దిశానిర్దేశం చేస్తారన్నారు. ఇక జనసేన పార్టీ పక్షాన తీసుకురానున్న మ్యాగజైన్‌‌కు సంబంధించిన పనులు చురుగ్గా నడుస్తున్నాయని.. సామాజక, రాజకీయ పత్రికగా ఇది రూపుదిద్దుకుంటుందని తెలిపారు. మరి జనసేన పార్టీ కమిటీ జాబితా మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసి షేర్ చెయ్యండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానెల్ ను సబ్ స్కైబ్ అయ్యి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చెయ్యండి.