తెలంగాణ‌లో జ‌న‌సేన జెండా ఎక్క‌డ

340

తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌ల హీట్ మొద‌లైంది.. మ‌రి ఇప్పుడు ఇక్క‌డ తెలుగుదేశం జ‌న‌సేన మాత్రం ఇంకా సిద్దంగా లేవు అని తెలుస్తోంది.. మ‌రి మూడు నెలల్లో ముంద‌స్తు ఎన్నిక‌లు జ‌రుగుతాయి.. ఈ స‌మ‌యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇక్క‌డ కేడ‌ర్ని ఇంకా సిద్దం చేయ‌లేదు. మ‌రి జ‌న‌సేనాని ఈ సారి కూడా ఇక్క‌డ ఎన్నిక‌ల్లో పోటీకి ఉంటారా లేదా అనే ఆలోచ‌న అప్పుడే మొదలైంది ..ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ త‌ర‌పున నాయ‌కులు కాంగ్రెస్ లోకి వెళ్లిపోవ‌డం, కాంగ్రెస్ తెలుగుదేశం వ‌చ్చే ఎన్నికల్లో, క‌లిసి పోటీ చేస్తాయి అనే వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో, వారు ఇరువురు కలిసి రాజ‌కీయం చేసే ఆలోచ‌న ఉంది అనేది స్ప‌ష్టం అవుతోంది.

Related image

మరి ఇప్పుడు తెలంగాణ‌లో జ‌న‌సేన రోల్ ఎలా ఉండ‌బోతోంది.. పార్టీ త‌ర‌పున పోటికి కేడ‌ర్ ఉన్నారా అనే ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి.. ఇక్క‌డ రాజ‌కీయంగా ప‌వ‌న్ యాక్టీవ్ గా లేరు.. ఇది జ‌న‌సైనికులు కూడా చ‌ర్చించుకుంటున్న అంశం. ఇక్క‌డ ఇక‌నైనా స‌ర్వేల రిపోర్టులు చూసి టిక్కెట్లు ఎవ‌రికి ఇస్తారు అనేది తెలియ‌చేయాల‌ని.. పార్టీని ఈ మూడు నెల‌ల్లో స‌మాయ‌త్తం చేసి ఎన్నిక‌ల్లో వెళ్లాల‌ని చెబుతున్నారు.. అయితే ఇక్క‌డ తెలంగాణ‌లో ప‌వ‌న్ పోటీ చేయ‌క‌పోతే మ‌రి ఎటువంటి విమ‌ర్శ‌లు వ‌చ్చినా, అవి 2019 ఎన్నికల్లో, ఏపీలో జ‌న‌సేన‌పై ప‌డ‌తాయి. సో ఇదంతా ప‌వ‌న్ ఆలోచించే అంశం.

Image result for janasena flag

మ‌రి ప‌వ‌న్ మాత్రం తెలంగాణ‌లో ముందు అడుగు మాత్రం వేయ‌డం లేదు.. ఇక దీని పై దృష్టిపెట్టాలి అని, టీఆర్ ఎస్ – కాంగ్రెస్ ముందు నుంచి అనుకున్న‌విధంగా పొలిటిక‌ల్ గా వెళుతున్నాయి అని చెబుతున్నారు జ‌న‌సైనికులు.. మ‌రి ప‌వ‌న్ మాత్రం ఏపీలోనే రాజ‌కీయాలు చేస్తున్నారు చూద్దాం ఎటువంటి నిర్ణ‌యాలు ఆయ‌న తీసుకుంటారో.