కశ్మీర్ లో బట్టలు కుట్టే టైలర్ ఇంట్లో ఏం దొరికాయో చూసి ఇండియన్ ఆర్మీ మొత్తం షాక్

441

కొద్దిరోజులుగా నివురు గప్పిన నిప్పులా ఉంటోన్న జమ్మూ కాశ్మీర్ సోమవారం నాటికి పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారిపోయాయి. ఆదివారం అర్ధరాత్రి 12 గంటల నుంచి శ్రీనగర్ జిల్లాలో 144 సెక్షన్ విధించారు. పౌర జీవనంపై ఆంక్షలు విధించారు. ఇద్దరికి మించి గుమికూడదని సైన్యం ఆదేశాలు జారీ చేసింది. జమ్మూలోని పూంఛ్, రాజౌరీ, దొడ, కిష్త్వర్‌ జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వం భారీగా బలగాలను మోహరించింది. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవును ప్రకటించారు.

Jammu And Kashmir: Indian Army Recovers 15 Grenades From Tailoring Shop in Keran Sector

ఇతర రాష్ట్రాల విద్యార్థులను రాత్రికి రాత్రి వారి స్వస్థలాలకు తరలించారు. మరోవంక- ప్రభుత్వం నేషనల్‌ కాన్ఫరెన్స్‌, పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్ నేతలను గృహ నిర్బంధంలో ఉంచింది. జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ వారి ఇళ్లల్లో వారు బందీలు అయ్యారు. వారితో పాటు కాంగ్రెస్ నేత ఉస్మాన్ మాజిద్, సీపీఎం ఎమ్మెల్యే ఎంవై తరిగమిలను సైతం అరెస్టు చేశారు. జమ్మూ కాశ్మీర్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో మొబైల్, ఇంటర్ నెట్ సేవలను నిలిపివేశారు. జమ్మూ కాశ్మీర్ లో నెలకొన్న పరిస్థితులపై తప్పుడు సమాచారం బాహ్య ప్రపంచానికి వ్యాపింపజేస్తారనే ఉద్దేశంతో ఇంటర్ నెట్, మొబైల్ సేవలను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. శాటిలైట్ ఫోన్లు, అధికారిక కమ్యూనికేషన్లు మాత్రమే ప్రస్తుతం అక్కడ అందుబాటులో ఉన్నాయి. జిల్లా పోలీసు యంత్రాంగం, న్యాయస్థానాలకు మాత్రమే పరిమితం చేశారు. చాలా ప్రాంతాల్లో పెట్రోలు బంకులను మూసివేశారు. మీడియా ప్రతినిధుల కోసం బీఎస్ఎన్ఎల్ శాటిలైట్ ఫోన్లను అందుబాటులోకి తీసుకొచ్చినప్పటికీ.. కళ్లు తిరిగే ధరలను నిర్ధారించింది. ఒక న్యూస్ ఐటమ్ ను బదిలీ చేయడానికి లక్ష రూపాయల ఛార్జీని వసూలు చేస్తామని బీఎస్ఎన్ఎల్ వెల్లడించింది. మొత్తానికి అనుకున్న విధంగా కేంద్రం ఆర్టికల్ 370 ని రద్దు చేస్తూ పార్లమెంట్లో ప్రకటన చేశారు అమిత్ షా. ఈ సమయంలో జమ్మూలో కొన్ని ప్రాంతాల్లో సెర్చ్ చేస్తున్న ఆర్మీకి భయం కలిగించే ద్రశ్యాలు అక్కడ నివాసాలలో కనిపిస్తున్నాయి..

ఈ క్రింది వీడియో ని చూడండి

జమ్మూ కాశ్మీర్ లో భద్రతా బలగాలు ఓ టైలరింగ్ షాప్ నుంచి పెద్ద ఎత్తున గ్రెనేడ్లను స్వాధీనం చేసుకున్నాయి. కుప్వారా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. కుప్వారా జిల్లాలోని కెరన్ సెక్టార్ లో జవాన్లు పర్వేజ్ ఖవాజా అనే టైలర్ నుంచి వాటిని స్వాధీనం చేసుకున్నారు. కెరన్ సెక్టార్ లో పాకిస్తాన్ సరిహద్దులను దాటుకుని భారత్ లోకి చొరబడటానికి ప్రయత్నించిన అయిదుమంది ఉగ్రవాదులను కాల్చి చంపిన కొన్ని గంటల వ్యవధిలో ఈ ఘటన చోటు జరిగింది. పర్వేజ్ ఖవాజాకు చెందిన టైలరింగ్ షాప్ లో భారీ పేలుడు చోటు చేసుకుంది.

Image result for కాశ్మీర్ లో బట్టలు కుట్టే టైలర్

ఈ పేలుడు ఫలితంగా అతని పొరుగింట్లో నివాసం ఉంటోన్న అబ్దుల్ హమీద్ బజద్ అనే వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు.ముందు తమ ఇంట్లో సిలిండర్ పేలిందని పర్వేజ్ ఖవాజా నమ్మించడానికి ప్రయత్నించాడు. పేలుడు సమాచారం అందుకున్న వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్న జవాన్లు.. అతని టైలరింగ్ షాపులో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా 15 గ్రెనేడ్లు వారి కంట పడ్డాయి. దుస్తుల మాటున వాటిని దాచి ఉంచారు. పర్వేజ్ ఖవాజాను జవాన్లు అదుపులోకి తీసుకున్నారు. అతణ్ని స్థానిక పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. గ్రెనేడ్లను స్వాధీనం చేసుకున్నారు.

Image result for కాశ్మీర్ లో

ఇదే సెక్టార్ పరిధిలో సరిహద్దులను దాటుతున్న అయిదు మంది అనుమానిత ఉగ్రవాదులను సరిహద్దు భద్రతా బలగాలు కాల్చి చంపిన విషయం తెలిసిందే. సరిహద్దుల వెంట కంచె బలహీనంగా ఉన్న ప్రాంతం నుంచి భారత భూభాగంపైకి అడుగు పెట్టడానికి ప్రయత్నించిన ఆ అయిదు మంది ఉగ్రవాదులనూ బీఎస్ఎఫ్ బలగాలు మట్టుబెట్టాయి. ఈ ఘటన చోటు చేసుకున్న కొన్ని గంటల వ్యవధిలో టైలరింగ్ షాప్ లో పేలుడు సంభవించడం, భారీ ఎత్తున గ్రెనేడ్లు లభించడం స్థానికులను ఉలిక్కి పడేలా చేసింది. ఈ ఘటనపై జమ్మూ కాశ్మీర్ పోలీసులు సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తారు.