జ‌మ్మ‌ల‌మ‌డుగు టీడీపీలో వార్ ముదిరింది

365

క‌డ‌ప జిల్లాలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో అన్నీ సెగ్మెంట్లు తెలుగుదేశం విజయం సాధిస్తుంది అని తెలుగుదేశం పార్టీ నాయ‌కులు తెలియ‌చేస్తున్నారు….మ‌రి వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎటువంటి ప్లాన్స్ వేస్తున్నారో ఆ నాయ‌కుల‌కే తెలియాలి.. తెలుగుదేశం పార్టీ నుంచి నాయ‌కులు వ‌చ్చే ఎన్నిక‌ల్లో జిల్లాలో విజ‌యం వ‌స్తుందా లేదా అనే ఆలోచ‌న‌లో ఉంటే, వారి వెర్ష‌న్ కూడా రాజ్య‌స‌భ స‌భ్యుడు సీఎం ర‌మేష్ , జిల్లా మంత్రి ఆదినారాయణ రెడ్డ్డే చెబుతున్నారు… వ‌చ్చే ఎన్నిక‌ల్లో పులివెందుల‌లో కూడా జగ‌న్ ఓడిపోతాడు… జిల్లాలో 10-10 సెగ్మెంట్లు తెలుగుదేశం విజ‌యం సాధిస్తుంది అని చెబుతున్నారు.. మ‌రి తెలుగుద‌శం దీనికి త‌గ్గట్టుగా ఎటువంటి ప్ర‌ణాళిక ర‌చిస్తుంది అంటే? అది జిల్లా నాయ‌కుల‌కు కూడా తెలియ‌దు అని అంటున్నారు త‌మ్ముళ్లు.

ఇక తెలుగుదేశం పార్టీకి రాజంపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు టీడీపీ త‌ర‌పున మేడా మ‌ల్లికార్జున రెడ్డి..జిల్లా నుంచి టీడీపీ త‌ర‌పున గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా ఆయ‌నే ఉన్నారు..ఇక తెలుగుద‌శం పార్టీకి పార్టీ గుర్తుపై గెలిచిన వారు జిల్లా నుంచి లేరు.. కాని జ‌గ‌న్ చెంత‌న ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు జ‌య‌రాములు – ఆదినారాయ‌ణ రెడ్డిని పార్టీలో చేర్చుకుని ఆదినారాయ‌ణ రెడ్డికి మంత్రి ప‌ద‌వి కూడా ఇచ్చారు …ఇక్క‌డ‌తో ఎలా ఉన్నా వ‌ర్గ‌పోరు మాత్రం ఇక్క‌డ పెరిగిపోయింది అనే చెప్పాలి… జ‌మ్మ‌లమ‌డుగులో వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలిచేందుకు ఆదినారాయ‌ణ రెడ్డి ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు ..అలాగే ఆదినార‌య‌ణ రెడ్డి ప్ర‌య‌త్నాలు ఎలా ఉన్నా, తెలుగుదేశం త‌ర‌పున టికెట్ ఎవ‌రికి వ‌స్తుంది అనేది మాత్రం ఇంకా ఓ డైల‌మాగా ఉంది.. ఇటు ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇచ్చినా రామ‌సుబ్బారెడ్డి కుటుంబం మాత్రం శాంతించ‌డం లేదు… మాజీ మంత్రిగా రామ‌సుబ్బారెడ్డి టీడీపీ త‌ర‌పున జిల్లాలో చ‌క్రం తిప్పారు… ఇప్పుడు ఆదినారాయ‌ణ రెడ్డి ఆ చ‌క్రం తిప్పుతున్నారు… ఇటు రామ‌సుబ్బారెడ్డి అక్క‌లు శివారెడ్డి కుమార్తెలు కూడా చంద్ర‌బాబుకు తెలియ‌చేశారు…

వ‌చ్చే ఎన్నిక‌ల్లో మా త‌మ్ముడికి మాత్ర‌మే టికెట్ ఇవ్వాల‌ని… దీనికి చంద్ర‌బాబు ఎటువంటి స‌మాధానం ఇరు కుటుంబాల‌కు ఇవ్వ‌లేదు అని తెలుస్తోంది… ఇటు ఆదినారాయ‌ణ రెడ్డి కుటుంబంలో కూడా అన్న‌కుమారుడు ఈ సారి త‌న‌ను ఎమ్మెల్యేగా నిల‌బెట్టాలి అని కోరుతున్నాడు… గ‌తంలో అంద‌రూ అన్న‌ద‌మ్ములు ఆదినారాయ‌ణ‌రెడ్డికి స‌పోర్ట చేయ‌డంతో ఆయ‌న ఎమ్మెల్యే అయ్యారు దీంతో కుటుంబంలో అన్న కొడుక్కి ఈ సారి ఎమ్మెల్యేగా అవ‌కాశం ఇవ్వాలి అని కోరుతున్నారు… మ‌రో వైపు ఆదినారాయ‌ణ రెడ్డి కుమారుడ్ని పొలిటిక‌ల్ గా దింపాలి అని ఆదినారాయ‌ణ రెడ్డి చూస్తున్నారు.. సో జ‌మ్మ‌ల‌మ‌డుగు రాజ‌కీయంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ పై టీడీపీ ఇంకా ఆలోచ‌న‌లో ఉంది అని చెప్పాలి.


ఇటు వైసీపీ త‌ర‌పున నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జ్ గా ఉన్నారు సుధీర్ రెడ్డి …ఆయ‌న‌కు జ‌గ‌న్ బాధ్య‌త‌లు అప్ప‌గించి సెగ్మెంట్లో కేడ‌ర్ చేజారి పోకుండా చూస్తున్నారు… ఇటు వైసీపీ త‌ర‌పున వైయ‌స్. వివేకానంద‌రెడ్డి, లేదా వైయ‌స్ విజ‌య‌మ్మ లేదా అవినాష్ రెడ్డి నిల‌బ‌డే అవకాశం ఉంది అని జ‌మ్మ‌ల మ‌డుగు నుంచి వార్త‌లు అయితే వ‌స్తున్నాయి.. ఇక్క‌డ వైసీపీ ఈ సారి ఎలాగైనా విజ‌యం సాధిస్తుంది అని నేత‌లు ప్ర‌జ‌లు ముక్త కంఠంతో చెబుతున్నారు… మ‌రి ఆదినార‌య‌ణ రెడ్డి ప్ర‌ణాళిక‌లు ఏమిటోచూడాలి.