జ‌లీల్ ఖాన్ కు ప‌ద‌వీ గండం?

380

విజ‌య‌వాడ ప‌శ్చిమ ఎమ్మెల్యే జ‌లీల్ ఖాన్ వైసీపీ నుంచి పార్టీ ఫిరాయించి ఏ నాడు అయితే తెలుగుదేశంలో చేరారో… ఆ నాటి నుంచి అనేక ఆటంకాలు వ‌స్తున్నాయి… ఆయ‌న వార్త‌ల్లో వైర‌ల్ గా నిలుస్తున్నారు… బీకాం ఫిజిక్స్ నుంచి మొద‌లు వ‌క్ప్ బోర్డ్ వివాదాల వర‌కూ ఆయ‌న వార్త‌ల్లో నిలుస్తున్నారు.

Image result for jalil khan

తాజాగా జామా మసీదు ఆస్తులు అన్యాక్రాంతం చేస్తున్నారంటూ సీపీఐ, జనసేన పార్టీ నేతలు విజయవాడలో మంగళవారం వేర్వేరుగా ఆందోళనలు చేపట్టారు…. వక్ఫ్‌బోర్డ్‌ చైర్మన్‌ జలీల్‌ఖాన్‌ ఓ సంస్థకు కారు చవకగా జామా మసీదు ఆస్తులు కట్టబెట్టారని వారు ఆరోపించారు… కోట్ల రూపాయ‌ల విలువైన ఆస్తులు కేవ‌లం ఐదు ల‌క్ష‌ల రూపాయ‌ల‌కు క‌ట్ట‌బెట్టార‌ని వారు మండిప‌డుతున్నారు.. ఈ ప‌ద‌వి చేయ‌డానికి ఆయ‌న అర్హుడు కాదు అని మండిప‌డుతున్నారు.

Image result for jalil khanవక్ఫ్‌ బోర్డ్‌ చైర్మన్‌ పదవి నుంచి జలీల్‌ఖాన్‌ను తొలగించాలని ఇరు పార్టీలకు చెందిన నేతలు డిమాండ్ చేశారు…. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్క‌డ నినాదాలు చేస్తున్న ఆందోళ‌న కారుల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు… అయితే ఇటు తెలుగుదేశం పార్టీలో ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి వ‌స్తుంది అని అనుకుంటే, చివ‌రి నిమిషంలో ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి రాలేదు.. ఇప్పుడు కూడా వ‌చ్చిన ప‌ద‌వికి కూడా గండం ఉంది అని సొంత గూటి నేత‌లే చ‌ర్చించుకుంటున్నారు.