జ‌లీల్ ఖాన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

393

ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడికి ధ‌ర్మాబాద్ కోర్టు ఇచ్చిన నాన్ బెయిల‌బుల్ అరెస్ట్ వారెంట్ తో ఏపీలో రాజ‌కీయాలు శ‌ర‌వేగంగా మారుతున్నాయి… సీఎం చంద్ర‌బాబుపై కేంద్రం ఎటువంటి చ‌ర్య‌లు తీసుకుంటోంది అని ప్ర‌శ్నిస్తున్నారు… కావాలి అని చంద్ర‌బాబు పై ఇటువంటి ప‌ద్ద‌తి అవ‌లంభిస్తున్నారు అని, కేంద్రం ఏపీపై మోస‌పూరితమైన చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతోంది అని విమ‌ర్శిస్తున్నారు నాయ‌కులు.

Image result for jaleel khan

వైసీపీ నుంచి తెలుగుదేశంలో చేరిన ఫిరాయింపు ఎమ్మెల్యే జలీల్ ఖాన్ మాట్లాడుతూ, సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్యాంకులకు కోట్లు ఎగ్గొట్టిన విజయ మాల్యాకు సహకరించిన కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీకి నాన్‌ బెయిలబుల్ వారెంట్ ఇవ్వండని కేంద్రానికి సూచించారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణకి పేరులోనే పెద్ద కన్నం ఉందని ఆయన విమర్శలు గుప్పించారు. అప్పట్లోనే కన్నా రాష్ట్రాన్ని ఇష్టానుసారంగా దోచేశారని జలీల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి నాయ‌కులను కాదు అని చంద్ర‌బాబు లాంటి మంచి నాయ‌కుడిపై టార్గెట్ చేయ‌డం ఏమిటి అని ఆయ‌న ప్ర‌శ్నించారు.

Image result for jaleel khan
మహా కూటమి అంటే ప్రధాని మోదీకి భయమేస్తోందని, అందుకే ఇలాంటి కుట్రలు పన్నుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. త్వరలోనే పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరబోతున్నారని జలీల్ ఖాన్ వ్యాఖ్యానించారు. ఇక తెలుగుదేశం పార్టీ లోకి ప‌లువురు నేత‌లు వైసీపీ నుంచి వ‌స్తారు అని జ‌లీల్ అన‌డంతో మ‌ళ్లీ ఫిరాయింపులు జోరు అందుకుంటాయా అని ఆలోచ‌న అయితే మొద‌లైంది.