జ‌గ‌న్ దృష్టి అంతా దానిమీదేనా..?

413

తెలుగుదేశం నాయ‌కులు జ‌గ‌న్ పై ఫోక‌స్ పెట్టారు.. గ‌త వారం రోజులుగా మ‌రింత తెలుగుదేశం వైసీపీని అలాగే జ‌గ‌న్ ని టార్గెట్ చేస్తున్నాయి.. ఎంపీల చేత రాజీనామాలు చేయించిన వైసీపీ అధినేత ఇప్పుడు ఏం చేయాలో తెలియ‌క డైల‌మాలో ఉన్నారు అని అంటున్నారు.. అయితే తెలుగుదేశం అధినేత సీఎం చంద్ర‌బాబు ఎంపీల‌తో ప్ర‌త్యేక హూదా కోసం పోరాటం మ‌రింత ఉదృతం చేయాలి అని చెబుతున్నారు.

Image result for jagan

పార్ల‌మెంట్లో ఎటువంటి విధానాలు అనుస‌రించాలి అనే విష‌యంలో చంద్ర‌బాబు ఎంపీల‌కు ఇప్ప‌టికే దిశానిర్దేశం చేశారు.. తెలుగుదేశం ఎంపీల వైపే ఇప్పుడు అంద‌రూ చూస్తున్నారు అని… ఏపీ ప్ర‌జ‌ల‌కు ప్ర‌త్యేక హూదా తీసుకువ‌చ్చేది పోరాటం చేస్తుంది ఎవ‌రో తెలుసు అని ఆయ‌న అన్నారు…
ఎంపీల‌కు విభజన చట్టం, అప్పటి ప్రధాని ఇచ్చిన హామీల అమలుపై పట్టుబట్టాలని తెలిపారు. పార్లమెంటులో హామీలు ఇచ్చారని…ఇప్పుడు చేయలేమని అఫిడవిట్లు వేస్తున్నారని మండిపడ్డారు.

Image result for jagan padayatra

ఇక కడప ఉక్కు తరహాలోనే రైల్వేజోన్‌పై పోరాటం తీవ్రం చేయాలని ఎంపీలకు చంద్రబాబు ఆదేశించారు. ప్రజాక్షేత్రంలో, పార్లమెంటులో పోరాటం చేయాలని…కేంద్రంపై ఒత్తిడి పెంచాలని అన్నారు. దేశవ్యాప్తంగా అన్ని వేదికలపై బీజేపీ మోసాన్ని ఎండగట్టాలని బాబు అన్నారు… కాపు రిజర్వేషన్ల చట్టం కేంద్రం ద‌గ్గ‌ర 9 నెలలుగా పెండింగ్‌లో ఉందని తెలిపారు. కాపు రిజర్వేషన్లను షెడ్యూల్ 9లో చేర్చాలని ఒత్తిడి తేవాలని ఎంపీలకు తెలిపారు చంద్ర‌బాబు .. ఇక ప్ర‌తిప‌క్ష నేత జగన్‌ దృష్టంతా కేసుల మాఫీపైనే అని విమర్శించారు చంద్ర‌బాబు. ఇక్క‌డ మోడీని విమ‌ర్శించ‌ని జ‌గ‌న్, త‌న కేసుల మాఫీ కోసం ఎటువంటి ప‌నులు చేస్తున్నాడో ప్ర‌జ‌ల‌కు తెలుసు అని విమ‌ర్శించారు చంద్ర‌బాబు.