జగన్ పొలిటికల్ జర్నీ తప్పక చూడాల్సిన వీడియో

307

మరి కొన్ని గంట్లలో ఏపీలో పోలీంగ్ జరుగనుంది. తొలివిడత ఎన్నికల్లో భాగంగా ఏపీలో రాజకీయ పార్టీలు పలు హామీలు మేనిఫెస్టోలు ఇచ్చి ప్రజలకు ఈ మూడు రోజులు దగ్గర అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్టీఆర్ హయాం నుంచి.. మూడు దశాబ్దాలుగా ఆధిపత్య, వారసత్వ రాజకీయాలు నడుస్తున్నాయి. టీడీపీ ఆవిర్భావానికి ముందు కాంగ్రెస్ హవా నడిస్తే.. ఎన్టీఆర్ పార్టీ పెట్టాక సీన్ మొత్తం మారిపోయింది. ఆ హవా 2004 వరకు అలాగే కొనసాగుతూ వచ్చింది. తర్వాత 2004 నుంచి కాంగ్రెస్ నేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుటుంబం టీడీపీకి ప్రత్యర్థిగా మారింది. ఎన్టీఆర్ కుటుంబం తర్వాత ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో వైఎస్ ఫ్యామిలీ కీలకంగా మారింది.

ఎన్టీఆర్ రాజకీయ వారసత్వాన్ని చంద్రబాబు అందిపుచ్చుకుంటే.. వైఎస్ మరణం తర్వాత.. ఆయన కుమారుడు జగన్‌మోహన్‌రెడ్డి ఆయన వారసుడిగా రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగారు. 2011లో పార్టీ స్థాపించి.. ఉపఎన్నికల్లో క్లీన్ స్వీప్‌తో సత్తాచాటారు. కానీ 2014 ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ బలోపేతంపై పూర్తిస్థాయిలో దృ ష్టిపెట్టి.. మళ్లీ చంద్రబాబుతో పోటీపడుతున్నారు. అధికారం కోసం టీడీపీతో హోరా-హోరీగా పోరాడుతున్నారు. కాంగ్రెస్ అధిష్టానంతో విభేదించిన వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి.. 2011లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. రాష్ట్రంలో బలమైన నేతగా ఎదిగారు. ఇటు జగన్‌కు ప్రత్యర్థిగా చంద్రబాబు ఉన్నారు. చంద్రబాబు ఎన్టీఆర్‌కు ఉన్న ఆదరణ, రాజకీయ వారసత్వంతో ముందుకు సాగుతుంటే.. ఇటు జగన్ తన తండ్రికి ప్రజల్లో ఉన్న అభిమానం.. ఆయన హయాంలో జరిగిన సంక్షేమ పాలనను గుర్తు చేస్తూ ప్రజల్లోకి వెళుతున్నారు.

Image result for jagan

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2009 ఎన్నికల్లో వైఎస్ జగన్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. కడప ఎంపీగా పోటీ చేసి.. టీడీపీ నుంచి పోటీ చేసిన శ్రీకాంత్ రెడ్డిపై లక్షా 78వేల ఓట్లతో భారీ మెజార్టీతో గెలిచారు. అదే ఎన్నికల్లో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రాగా.. రాజశేఖర్‌రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత 2009 సెప్టెంబర్‌లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. అనంతరం కాంగ్రెస్ అధిష్టానం సీనియర్ నేత, ఆర్థిక మంత్రిగా ఉన్న కొణిజేటి రోశయ్యను ముఖ్యమంత్రిని చేసింది. జగన్ సీఎం పదవి ఆశించినా.. కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపలేదు.

Image result for jagan

వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణాన్ని చూసి తట్టుకోలేక ప్రాణాలు విడిచిన అభిమానులు, కార్యకర్తల కుటుంబాలను పరామర్శించేందుకు జగన్ ఓదార్పు యాత్రకు సిద్ధమయ్యారు. తర్వాత పరిణామాలు మారిపోయి.. కాంగ్రెస్ అధిష్టానంతో జగన్ విభేదించారు. ఆ వెంటనే వైఎస్ కుటుంబంలో చీలిక మొదలయ్యింది.. జగన్ బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి కాంగ్రెస్ కేబినెట్‌లో చేరిపోయారు. ఈ పరిణామాలు నచ్చని జగన్ వెంటనే కాంగ్రెస్‌కు, ఎంపీ పదవికి రాజీనామా చేశారు. తల్లి విజయమ్మ కూడా పులివెందుల ఎమ్మెల్యేగా రాజీనామా చేశారు. జగన్ 2011లో (YSRCP)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. తన తండ్రి ఆశయాలు, సంక్షేమ పాలనను అందించడమే లక్ష్యమంటూ ప్రజల్లోకి వెళ్లారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో జగన్ కడప ఎంపీగా జగన్ పోటీ చేసి 5లక్షల 43 వేల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఇక విజయమ్మ పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయగా.. కాంగ్రెస్ జగన్ బాబాయి వైఎస్ వివేకాను బరిలోకి దింపింది. కానీ విజయమ్మ 85వేల ఓట్ల భారీ మెజార్టీతో గెలిచారు.

Image result for jagan

కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు వైఎస్ కుటుంబం కడపలో ఆరు సార్లు.. పులివెందులలో 10సార్లు విజయఢంకా మోగించింది. 2011లో మాత్రం వైసీపీ నుంచి అభ్యర్థులుగా పోటీచేసి గెలిచారు. ఇక 2012లో ఆస్తుల కేసుల్లో జగన్‌ను సీబీఐ అరెస్ట్ చేయగా.. తర్వాత 16 నెలలు జైల్లో ఉన్నారు. జగన్ లేకపోయినా విజయమ్మ పార్టీ గౌరవాధ్యక్షురాలిగా బాధ్యతల్ని చక్కదిద్దారు. ఇక జగన్ సోదరి షర్మిల అన్నకు మద్దతుగా పాదయాత్ర చేపట్టారు. ఇక 2104 ఎన్నికల్లో జగన్ పులివెందుల నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించగా.. తల్లి విజయమ్మ విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాగా.. వైసీపీ 67 సీట్లతో ప్రతిపక్ష హోదా దక్కించుకుంది. ఏపీలో కీలక పార్టీగా మారింది. 2019 ఎన్నికల్లో జగన్ మళ్లీ పులివెందుల నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తుండగా.. సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి కడప ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు.

Image result for jagan

వైఎస్ కుటుంబానికే చెందిన జగన్ మేనమామ పీ. రవీంద్రనాథ్ రెడ్డి కడప జిల్లా కమలాపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 2014లో ఒంగోలు ఎంపీగా గెలిచిన జగన్ బాబాయి వైవీ సుబ్బారెడ్డి.. ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. కేవలం పార్టీ బాధ్యతలకే పరిమితం అయ్యారు. నాలుగు వారాల క్రితం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సోదరుడు పులివెందులలోని తన ఇంట్లో దారుణ హత్యకు గురయ్యాడు. ఆయన కూడా వైసీపీలో కీలక నేతగా ఉన్నారు. ఈ హత్యకు టీడీపీనే కారణమని వైసీపీ ఆరోపించింది. వైఎస్ రాజారెడ్డి హత్య తర్వాత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, వివేకానంద రెడ్డిల మరణాలపై ఇప్పటికీ అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. కడప జిల్లాలో 1996లో ఆధిపత్య పోరుతో ఫ్యాక్షన్ రాజకీయాలు నడిచాయి. అదే సమయంలో 1998లోనే రాజారెడ్డి ప్రత్యర్థుల బాంబు దాడిలో చనిపోయారు. ఇలా వైఎస్ కుటుంబం.. ఏపీలో రెండో రాజకీయ వారసత్వమున్న పెద్ద కుటుంబంగా కీలకంగా మారింది. వైఎస్సార్ వారసుడు జగన్‌కు ఈసారైనా అధికారం దక్కుతుందా.. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారా అంటే మే 23 వరకు ఆగాల్సిందే.