జ‌గ‌న్ పాద‌యాత్ర మ‌రో మైలు రాయి

373

వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర ప్ర‌స్తుతం తూర్పుగోదావ‌రి జిల్లాలో కొన‌సాగుతోంది.. ఇక మంగ‌ళ‌వారం ఉత్తరాంధ్రాకు ఆయ‌న పాద‌యాత్ర చేరుకోనుంది విశాఖ నుంచి ఆయ‌న పాద‌యాత్ర ప్రారంభం అవ‌నుంది…. ఈరోజు 234 వ‌రోజు పాద‌యాత్ర‌లో భాగంగా తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడిలో మండలంలోని డీజేపురం నుంచి ప్రారంభమైన పాద‌యాత్ర తుని నియోజకవర్గంలో కొన‌సాగుతోంది…….తుని నియోజకవర్గంలో అడుగుపెట్టిన వైఎస్‌ జగన్‌కు అడుగడుగునా ఘనస్వాగతం లభిస్తోంది. ఆయన రాకతో నియోజకవర్గంలో పండుగ వాతావరణం నెలకొంది అని చెప్పాలి.

కొత్త వేలంపేట, సీతయ్యపేట, లోవకొత్తూరు, తాల్లూరు జంక్షన్‌, జగన్నాథగిరి మీదుగా తుని వరకు పాదయాత్ర కొనసాగనుంది. ఇవాళ పాదయాత్ర 2700 కిలోమీటర్ల మైలురాయిని దాటనుండటం విశేషం. అందుకు గుర్తుగా ఆ ప్రాంతంలో వైఎస్‌ జగన్‌ పార్టీ జెండాను ఎగురవేసి.. ఒక మొక్కను కూడా నాటుతారు.. సాయంత్రం తునిలో బ‌హిరంగ స‌భ‌లో ఆయ‌న పాల్గొనున్నారు… సాయంత్రం జ‌రిగే బ‌హిరంగ స‌భ‌లో ఆయ‌న తుని నియోజ‌క‌వర్గం గురించి రాష్ట్ర స‌మ‌స్యల గురించి ప్ర‌సంగించ‌నున్నారు..