ప్ర‌త్యేక హోదాపై జ‌గ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు

322

ఏపీకి ప్ర‌త్యేక హోదా కావాల‌ని ఏపీకి ప్ర‌త్యేక హోదా సంజీవ‌ని అని ప్ర‌జ‌లు కోరుతూనే ఉన్నారు.. అయితే కేంద్ర ప్ర‌భుత్వం మోడీ ఇచ్చిన హామీని ప‌క్క‌న పెట్టేశారు,గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో ఏపీకి ప్ర‌త్యేక‌హోదా ఇస్తామ‌ని ఆరోజు హామీ ఇచ్చారు కాని ఇప్పుడు మాత్రం ఏపీకి ప్ర‌త్యేక హోదాని ప‌క్క‌న పెట్టేశారు. ఇక ఏపీకి హోదా ఉద్య‌మం జ‌రుగుతూనే ఉంది, బీజేపీ పై నిర‌స‌న‌లు చేస్తూనే ఉన్నారు, తెలుగుదేశం వైసీపీ ఈ పోరాటంలో రాజ‌కీయంగా ర‌క్తిక‌ట్టించిన‌ వైసీపీ ఎంపీలు రాజీనామాలుచేశారు.. అయినా ఎటువంటి హోదా ప్ర‌క‌ట‌న కేంద్రం నుంచి రాలేదు ఇక ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం ఇప్ప‌టికే ఆత్మ‌హ‌త్య‌ల‌కు కూడా కొంద‌రు పాల్పడ్డారు.

Image result for jagan speech

ఏపీకి ప్రత్యేక హోదా లేకపోవడం వల్లే తన అన్నకు ఉద్యోగం రాలేదని మనస్తాపం చెంది మహేంద్ర అనే 14 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్ర‌స్తుతం ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా భీమిలి నియోజకవర్గం ఆనందపురంలో ఉన్న వైఎస్‌ జగన్‌ ఈ సంఘటన తెలుసుకుని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుని కుటుంబానికి సంతాపం తెలిపారు. ఈ సారి ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని, తప్పక ప్రత్యేకహోదా సాధిస్తుందని ఆయన తెలిపారు.Image result for jagan speech

కాబట్టి యువత సంయమనం పాటించాలని ఎటువంటి తొందరపాటు చర్యలకు పాల్పడవద్దని కోరారు ఇలా ఆత్మ‌హ‌త్య‌లు చేసుకోవ‌డం వ‌లన సాధించేది ఏమీ లేదు అని వైసీపీ నాయ‌కులు తెలియ‌చేస్తున్నారు …ఇక వైసీపీ అధికారంలోకి రాగానే ఏపీకి క‌చ్చితంగా ప్ర‌త్యేక హోదా సాధించుకుందామ‌ని యువ‌త‌కు పిలుపునిచ్చారు నేత‌లు .