బాబాయ్ మ‌ర‌ణించారు అని కోర్టులో ప‌ర్మిష‌న్ తీసుకున్న జ‌గ‌న్ జ‌డ్జి ఏమ‌న్నారో తెలిస్తే షాక్

366

ఆంధ్ర‌ప్ర‌దేశ్ దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి సోద‌రుడు, జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చిన్నాన్న, ప్ర‌ముఖ రాజ‌కీయ‌నాయ‌కుడు వైఎస్ వివేకానంద‌రెడ్డి ఈరోజు గుండెపోటుతో మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. పులివెందులలో ఆయ‌న‌ స్వగృహంలోనే ఈరోజు తెల్లవారు జామున గుండెపోటు రావడంతో, ఒక్కసారిగా కుప్పకులిపోయిన వివేకానంద‌రెడ్డి తుది శ్వాస విడిచారు. దీంతో వివేకానంద‌రెడ్డి మ‌ర‌ణంతో ఆయ‌న కుటుంబంలోనూ, అభిమానుల్లోనూ, వైసీపీ శ్రేణుల్లోనూ విషాద చాయ‌లు అలుముకున్నాయి.

ఈ క్రింది వీడియో చూడండి 

ఇక అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే బాబాయి మ‌ర‌ణ వార్త విన్న వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప‌రిస్థితి చాలా దారుణంగా ఉంద‌ని తెలుస్తోంది. ఈ రోజు శుక్ర‌వారం కావ‌డంతో, జ‌గ‌న్ నాంప‌ల్లి కోర్టుకు హాజ‌రు కావాల్సి ఉంది. దీంతో జ‌గ‌న్ వెంట‌నే హైద‌రాబాద్ నుండి పులివెంద‌ల వెళ్ళ‌లేక‌పోయారు. ఈ క్ర‌మంలో ముందుగా నాంప‌ల్లి హైకోర్టుకు వెళ్ళి, ప‌ర్మిష‌న్ తీసుకుని, బాబాయిని చివ‌రిసారి చూడ‌డానికి జ‌గ‌న్ వెళ్ళ‌నున్నార‌ని స‌మాచారం. ఇప్ప‌టికే వివేకానంద‌రెడ్డి మ‌ర‌ణ‌వార్త విని కృంగిపోయిన జ‌గ‌న్, బాబాయిని చివ‌రి చూపు చూడాడానికి అడ్డంకులు ఏర్ప‌డ్డాయి. దీంతో జ‌గన్ ప‌రిస్థితి చూసి ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌తో పాటు వైసీపీ శ్రేణులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.ఇక జ‌డ్జి ఆయ‌న‌కు ప‌ర్మిషన్ ఇచ్చారు అని, కోర్డులో ముందే జ‌గ‌న్ త‌ర‌పున లాయ‌ర్ ఈ విష‌యం జ‌డ్జికి చెప్పారు, వెంట‌నే సంత‌కం పెట్టి జ‌గ‌న్ ను ఆ కార్య‌క్ర‌మానికి వెళ్ల‌మ‌ని తెలియ‌చేశార‌ట జ‌డ్జి.

Image result for ys vivekananda reddy dead body

రాత్రి ప్ర‌చారం నుంచి వ‌చ్చిన ఆయ‌న తెల్లవారుజామున వాంతులు మొదలుకావవడంతో బాత్‌రూమ్‌లోకి వెళ్లి అక్కడే కుప్పకూలారు. ఆ సమయంలో ఇంట్లో వివేకానందరెడ్డి ఒక్కరే ఉన్నారు అని స‌మాచారం. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో స్నానాల గదిలోనే ఆయన ప్రాణాలు కోల్పోయారు అని తెలుస్తోంది ముందుగా పీఏ ఆయ‌న ర‌క్త‌పు మ‌డుగులో ఉండ‌టం చూసి ఆయ‌న అల్లుడికి ఫోన్ చేసి తెలియ‌చేశారు. ఆయ‌న మ‌ర‌ణానికి కార‌ణం నీర‌సంగా ఉండ‌టం వ‌ల్ల లేదా హ‌ర్ట్ అటాక్ వ‌చ్చిన స‌మ‌య‌యంలో ఆయ‌న‌కు తోడు లేక‌పోవ‌డ‌మా అనేది కూడా విచార‌ణ‌లో తేలాల్సి ఉంది.ఇటీవ‌లే ఆయ‌న‌కు గుండె కు స్టంట్ వేయ‌డం జ‌రిగింది.. అల‌స‌ట వ‌ల్ల నీర‌సం వ‌ల్ల ఆయ‌న‌కు స‌డెన్ స్ట్రోక్ వ‌చ్చిందా అని అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి.