రేపు జ‌గ‌న్ ఏం నిర్ణ‌యం తీసుకుంటారో?

359

ఏపీలో సెప్టెంబ‌ర్ ఆరు నుంచి అసెంబ్లీ స‌మావేశాలు జ‌రుగ‌నున్నాయి.. ఈ స‌మావేశాల్లో తెలుగుదేశం పార్టీ గ‌తంలో మాదిరిగా రాజ‌కీయంగా ముందుకు వెళుతుంది అనేది తెలిసిందే ..మ‌రి వైసీపీ అధినేగ జ‌గ‌న్ గ‌త అసెంబ్లీ స‌మావేశాలను బ‌హిష్క‌రించారు.. మ‌రి ఇప్పుడు అసెంబ్లీ స‌మావేశాల‌ను బ‌హిష్క‌రిస్తారా, లేదా ఎమ్మెల్యేల‌ను అసెంబ్లీకీ పంపించి ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ప్ర‌శ్నిస్తారా లేదా అనేది ఆలోచ‌న‌గా ఉంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయ‌కులు అయితే అసెంబ్లీ స‌మావేశాల‌కు రెడీ అయ్యారు.

Image result for jagan

మ‌రి వైసీపీ త‌ర‌పున మాత్రం ఎటువంటి స్పంద‌న స‌మాధానం లేదు. ఓప‌క్క తెలంగాణ రాజ‌కీయం పై మీడియా అంతా ఫోక‌స్ చేసింది.. రేపు తెలంగాణ అసెంబ్లీ ర‌ద్దు అయ్యే అవ‌కాశం ఉంది ..మ‌రి మీడియా కూడా అక్క‌డే స్టోరీల్లో ఉంది, కాని ఇటు ఏపీలో మాత్రం వైసీపీ వ‌స్తుందా జ‌గ‌న్ ఓపినియ‌న్ ఏమిటి అనేది ఇప్ప‌టికీ తెలియ‌డం లేదు.

మ‌రి వైసీపీ త‌ర‌పున నాయ‌కులు ఎమ్మెల్యేలు జ‌గ‌న్ కు అసెంబ్లీకీ వెళ‌తాము అని చెబుతున్నార‌ట.. కాని జ‌గ‌న్ దీనిపై నేడు నిర్ణ‌యం తీసుకుంటారు అని తెలుస్తోంది. జ‌గ‌న్ ఆలోచ‌న ప్ర‌కారం పాద‌యాత్ర‌లో ఉన్న స‌మ‌యంలో టీడీపీ మ‌రేమైనా ఎత్తులు వేస్తుందా అనేది కూడా ఆలోచిస్తున్నారు.