జగన్ మరో సంచలన నిర్ణయం కొత్త ఛానల్ ప్రారంభం ముహూర్తం ఫిక్స్

242

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెంబర్ టూ ఇప్పుడు మీడియా రంగంలోనూ అడుగు పెడుతున్నారు. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజ్‌న్యూస్ అనే న్యూస్ చానల్‌ను టేకోవర్ చేసినట్లు మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం కోమటిరెడ్డి బ్రదర్స్ అజమాయిషీలో ఉన్న న్యూస్ చానల్‌ను… వదలించుకోవాలని.. వాళ్లు నిర్ణయించుకున్నారు. రాజకీయంగా… మరో ఐదేళ్లు ఆ చానల్‌పై పెట్టుబడి పెట్టడం తప్ప.. ఎలాంటి ఉపయోగం ఉండదన్న అంచనాకు రావడంతో… ఆ చానల్ లైసెన్స్ దారులయిన.. తమిళులకు.. అప్పగించేయాలని నిర్ణయించుకున్నారు.

Image result for jagan

ఈ క్రమంలో ఆ చానల్ మూత పడుతుందన్న ప్రచారం కొద్ది రోజులుగా జరుగుతోంది. ఈ సమయంలో..విజయసాయిరెడ్డి…ఈ చానల్ నిర్వహణను తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన రాతకోతలు పూర్తయిపోయాయని చెబుతున్నారు. అయితే..ఇది కేవలం విజయసాయిరెడ్డి సొంతంగా నడుపుతారా.. లేక… ఇతరుల భాగస్వామ్యంతో నడుపుతారా అన్నదానిపై క్లారిటీ లేదు. ఎన్నికలు ముగిసిన తర్వాత న్యూస్ చానళ్లతో.. వైసీపీకి ఏం అవసరం అన్న చర్చ సహజంగానే రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. అయితే.. గతంలోలా.. ఇప్పుడు..వైసీపీ మద్దతిచ్చే న్యూస్ చానళ్లు తగ్గిపోయాయి.

ఈ క్రింది వీడియో చూడండి

గతంలో టీవీ ఫైవ్ , ఎన్టీవీ, హెచ్ఎంటీవీ లాంటి చానళ్లు మద్దతిచ్చినా… ఈ ఎన్నికలకు ముందు మాత్రం… తటస్థ పాత్ర పోషించాయి. ఈ కారణంగానే టీవీ ఫైవ్ చానల్ పై …వైసీపీ నిషేధం కూడా విధించింది. తమకు మీడియాలో గట్టి పట్టు లేదని భావిస్తున్నారు. అందుకే.. వీలైనన్ని మీడియా చానళ్లను…పెంచుకోవాలనే ఆలోచన చేస్తున్నారు. ఈ క్రమంలో .. రాజ్ న్యూస్ పై విజయసాయిరెడ్డి దృష్టి పడిందని అంటున్నారు. ఏపీ ఎన్నికల్లో గెలిచి తీరుతామనే ధీమాలో ఉన్న వైసీపీ నేతలు.. భవిష్యత్ ప్రణాళికల్ని ఇప్పటి నుంచి గట్టిగానే అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో మీడియా సపోర్ట్ పొందడం కన్నా…తామే సొంతంగా మీడియాగా రూపాంతరం చెందే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్క సాక్షి వాయిస్ ప్రజల్లోకి వెళ్లడం లేదని చాలా కాలంగా వైసీపీ నేతలు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆర్థిక సంక్షోభంలో ఉన్న మరిన్ని కొత్త చానళ్లు..కూడా వైసీపీ నెంబర్ టూ టేకోవర్ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.