హ‌ఠాత్తుగా ఎన్నిక‌ల ప్ర‌చారం ఆపేసిన జ‌గ‌న్ ఏమైందో తెలిసి షాకైన చంద్ర‌బాబు

363

ఆంద్ర‌ప్ర‌దేశ్‌లో రానున్న ఎన్నిక‌ల కోసం ప్ర‌తిప‌క్ష వైసీపీ- టీడీపీ తాడోపేడో తేల్చుకోవ‌డానికి సిద్ధ‌మవుతున్నాయి. ఒక‌వైపు అధికార తెలుగుదేశం పార్టీకి ఓట్ల గ‌ల్లంతు ఇష్యూలో మూడు చెరువుల నీళ్ళు తాగిస్తూ.. మ‌రోవైపు ఎన్నిక‌ల కోసం త‌న‌దైన వ్యూహాల‌తో సిద్ధ‌మ‌వుతోంది వైసీపీ. 13 రోజులు మాత్ర‌మే ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ఉంది. దీంతో ప్ర‌చారాల్లో త‌ల‌మున‌క‌లై పోయారు జ‌గ‌న్ చంద్ర‌బాబు ప‌వ‌న్ క‌ల్యాణ్.. ఇక మూడు పార్టీల నాయ‌కులు పార్టీ త‌ర‌పున బీ ఫార‌మ్ పొంది, పోటీ చేస్తున్న నేత‌లు అంద‌రూ కూడా పెద్ద ఎత్తున త‌మ సెగ్మెంట్ల‌లో ప్ర‌చారం చేస్తున్నారు. ఇక 26 వ తేదిన ఆయ‌న ఎన్నిక‌ల ప్రచారం కూడా ఆపేశారు. ఆరోజు జ‌గ‌న్ లోట‌స్ పాండ్ కే ప‌రిమితం అయ్యారు.. ఎందుకు ఆయ‌న ఇలా ప్ర‌చారం ఆపేసి ఆరోజు లోట‌స్ పాండ్ కు చేరుకుని నాయ‌కుల‌తో చ‌ర్చించారు అంటే ఓ తాజా విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది.

Image result for jagan

ఈ క్ర‌మంలో ఆరోజు పార్టీ మేనిఫెస్టో క‌మిటీతో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మావేశం అయ్యి.. మేనిఫెస్టోలో చేర్చాల్సిన అంశాల పై చ‌ర్చించిన‌ట్లు స‌మాచారం. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ మాట్లాడుతూ కేవ‌లం అధికారం కోసం అలివి కాని హామీలు జోలికి వెళ్ళొద్ద‌ని, ప్ర‌జ‌ల మేలు కోసం అమలు చేయ‌గ‌లిగే వాగ్దానాల‌నే మేనిఫెస్టోలో చేర్చాల‌ని, ఇత‌ర పార్టీల‌తో త‌మ‌కు పోటీ వ‌ద్ద‌ని జ‌గ‌న్ తేల్చి చెప్పారు.

ఈ క్రింది వీడియో చూడండి

అలాగే మేనిఫెస్టోలో మ‌నం ఇచ్చే హామీలకు సంబంధించి ఆర్థిక భారాన్ని కూడా బేరీజు వేసుకోవాల‌ని జ‌గ‌న్ సూచించారు. పాదయాత్ర‌లో త‌మ దృష్టికి వ‌చ్చిన స‌మ‌స్య‌లు క‌చ్ఛితంగా ప‌రిష్క‌రించేలా మేనిఫెస్టోను రూపొందించాల‌ని జ‌గ‌న్ తేల్చి చెప్పారు. వైసీపీ మేనిఫెస్టో పేజీలు పేజీలు ఉండొద్ద‌ని, అంద‌రికీ అర్థ‌మ‌య్యేలా సంక్షిప్తంగా ఉండాల‌ని జ‌గ‌న్ కీల‌క సూచ‌న‌లు చేశారు. దీంతో ఎన్నిక‌ల ముందు వైసీపీ మేనిఫెస్టోలో ఎలాంటి కీల‌క అంశాలు ఉండ‌నున్నాయో అని స‌ర్వత్రా ఆశ‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక నాలుగు పేజీల మేని ఫెస్టో మాత్రమే వైసీపీ విడుద‌ల చేస్తోంది అని తెలుస్తోంది.ఈ కమిటీకి వైసీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కన్వీనర్ గా వ్యవహరిస్తున్నారు. సభ్యులుగా 30 మందిని ప్రకటించారు వైఎస్ జగన్. మేని ఫెస్టో కమిటీలో పార్టీ సీనియర్ నేతలతోపాటు పలువురు ఎమ్మెల్యేలకు చోటు కల్పించారు. మ‌రి జ‌గ‌న్ ఎలాంటి మేనిఫెస్టో విడుద‌ల చేస్తారో చూడాలి.