అమ్మఒడి పై జగన్ సంచలన నిర్ణయం

208

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అత్యంత ప్రతిష్ఠాత్మ‌కంగా భావిస్తోన్న ప‌థ‌కం అమ్మ ఒడి. పేద‌, దిగువ మ‌ధ్య త‌ర‌గతి కుటుంబాల‌కు చెందిన మ‌హిళ‌లు త‌మ పిల్ల‌ల‌ను ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌కు పంపిస్తే.. అమ్మ ఒడి ప‌థ‌కం కింద సంవ‌త్స‌రానికి 15 వేల రూపాయ‌ల‌ను ప్ర‌భుత్వం వారికి కానుక‌గా చెల్లిస్తుంది. గ్రామాలు, మండ‌ల స్థాయిలో ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌కు పూర్వ వైభ‌వాన్ని తీసుకుని రావ‌డం, మ‌ధ్యలో బ‌డి మాని వేయ‌డాన్ని త‌గ్గించ‌డం, పేద పిల్ల‌ల‌కు ఉచితంగా ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల ద్వారా చ‌దువును చెప్పించాల‌నే ఉద్దేశంతో వైఎస్ జ‌గ‌న్ ఈ ప‌థ‌కాన్ని రూపొందించారు. అయితే ఇప్పుడు అమ్మఒడి పథకానికి ప్రభుత్వం మెలిక పెట్టింది, అమ్మఒడి పథకాన్ని తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి, ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు మాత్రమే వర్తింప చేస్తామని ఏపి ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేందర్ రెడ్డి చెప్పారు. అయితే ప్రయివేట్ స్కూలు విద్యార్థుకు అమలు చేసే అంశంపై త్వరలో చర్చిస్తామని అన్నారు ..దీంతో అమ్మఒడి పథకం ప్రైవేటు పాఠశాలకు వర్తిస్తుందా లేదా అనే సందిగ్థతకు మొత్తం మీద తెరదించింది ఏపి ప్రభుత్వం.

ఈ క్రింది వీడియో చూడండి

జగన్ ఎన్నికల్లో ప్రకటించిన విధంగా ప్రతి విద్యార్థి కుటుంభానికి కాకుండా కేవలం ప్రభుత్వం స్కూళ్లలో, అదికూడ తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న కుటుంభాలకే వర్తిస్తుందని ప్రకటించారు. ఇక అమ్మఒడి పథకాన్ని ప్రస్థుత విద్యా సంవత్సరం నుండే ప్రారంభిస్తామని ప్రకటించడంతో విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు అటు ప్రైవేటు స్కూల్స్ కూడ సంతోషాన్ని వ్యక్తం చేశారు. వేల రూపాయల ఫీజులు భరించలేక తల్లిదండ్రులు, సరైన సమయంలో ఫీజులు రాలేక విద్యా సంస్థలు సతమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం నుండి వచ్చిన ప్రకటన అటు విద్యార్థుల తల్లిదండ్రులతోపాటు ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలకు కూడ కోంత ఊరటనిచ్చింది. దీంతో తమ స్కూళ్లో అమ్మఒడి పథకం వర్తిస్తుందని పలు కార్పేరేట్ స్కూళ్లు అప్పుడే ప్రకటనలు కూడ ఇచ్చుకున్నాయి. త‌మ స్కూలులో అమ్మ ఒడి ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తున్నామ‌ని, దీన్ని అమ‌లు చేయ‌డానికి తాము ప్ర‌భుత్వం నుంచి గుర్తింపు తెచ్చుకున్నామంటూ ప్ర‌చారం చేయ‌డాన్ని ఆరంభించాయి. పిల్ల‌ల‌ను త‌మ స్కూలులో చేర్పిస్తే.. అమ్మ ఒడి ప‌థ‌కం కింద సంవ‌త్స‌రానికి 15 వేల రూపాయ‌ల‌ను పొంద‌వ‌చ్చ‌ని అంటూ కృష్ణా జిల్లాకు చెందిన గాయ‌త్రి విద్యాసంస్థ‌ల యాజ‌మాన్యం ప్ర‌చారాన్ని ఆరంభించింది. దీనిపై బ్యాన‌ర్లను క‌ట్టి మ‌రీ త‌ల్లిదండ్రుల‌కు గాలం వేస్తోంది. ప్ర‌భుత్వ ప‌థ‌కాన్ని ఆశ‌గా చూపించి.. త‌మ స్కూలులో విద్యార్థుల సంఖ్య‌ను పెంచుకునే ప్ర‌య‌త్నం చేస్తోంది.

Related image

అయితే అమ్మఒడి పథకం అమలుపై విద్యార్థుల తల్లి దండ్రులు, ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు భావించినట్టుగా కాకుండా ప్రభుత్వం నిర్ణయం మరోలా ఉంది. ఇప్పటి వరకు ఉన్న ప్రభుత్వ విద్యా వ్యవస్థ సరిగా లేక చాలమంది వెనకబడిన వర్గాలు అనేక కష్టనష్టాలకు ఓర్చి తమ పిల్లలను ప్రైవేటు విద్యా సంస్థల్లోనే చదివిస్తున్నారు. పిల్లల భవిష్యత్ కోసం అనేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇలాంటీ వాళ్లకు ప్రభుత్వం ఇచ్చే 15వేల కోసం అకస్మత్తుగా తమ పిల్లల స్కూళ్లను మార్చే పరిస్థితి ఉండదు..దీంతో ప్రజలు ఆశించిన విధంగా అమ్మ ఒడి పథకం అమలయ్యో అవకాశాలు ఉన్నాయా లేవా అనేది ప్రభుత్వం తేల్చాల్సి ఉంది. మరి అమ్మవడి పథకంలో ప్రభుత్వం పెట్టిన షరత్ గురించి అమ్మవడి పథకం మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.