14 నుంచి జ‌గ‌న్ పాద‌యాత్ర ఆ జిల్లాలో ప్రారంభం

405

వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర ప్ర‌స్తుతం తూర్పుగోదావ‌రి జిల్లాలో కొన‌సాగుతోంది.. ఇక ఆయన పాద‌యాత్ర ఈ నెల 14 న విశాఖ చేరుకోనుంది.. అక్క‌డ నుంచి ఆయ‌న పాద‌యాత్ర ప్రారంభం కానుంది…నాడు రాజన్న ప్రవేశించిన గన్నవరం మెట్టు వద్దే వైఎస్‌ జగన్‌ తొలి అడుగు వేయ‌నున్నారు. ఏడు నియోజకవర్గాల్లో ఏడు బహిరంగ సభలు జ‌రుగనున్నాయి.అనకాపల్లి పార్లమెంటు జిల్లా పరిధిలో 210 కి.మీ. పాదయాత్ర  చేయ‌నున్నారు జ‌గ‌న్.

Image result for jagan padayatra

జ‌గ‌న్ కు జిల్లాలో అపూర్వ స్వాగతానికి పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలి అని   పిలుపునిచ్చారు. వైఎస్సార్‌సీపీ అనకాపల్లి పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌….నాతవరం మండలం గన్నవరం మెట్టులోనే ఆయ‌న పాద‌యాత్ర జ‌రుగ‌నుంది…వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి2003లో చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కొత్త చరిత్ర లిఖించిన విధంగానే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహిస్తున్న ప్రజాసంకల్ప యాత్ర నవ్యాంధ్రప్రదేశ్‌లో కొత్త శకానికి నాంది పలుకుతుందన్నారు.

Related image

అధికారం కోసం కల్లబొల్లి కబుర్లతో బురిడికొట్టిన చంద్రబాబు తీరును ప్రజా సంకల్పయాత్రలో ప్రజలు బట్టబయలు చేస్తున్నారన్నారు. ప్రజాసంక్షేమానికి జగన్‌మోహన్‌రెడ్డి ఇస్తున్న హామీలను విశ్వసిస్తున్న ప్రజలు గత 232 రోజులుగా ప్రతిచోటా ఆయనకు నీరాజనాలు పలుకుతున్నారన్నారు. నర్సీపట్నం నియోజకవర్గంలో ప్రారంభమయ్యే యాత్ర పాయకరావుపేట, ఎలమంచలి, అనకాపల్లి, చోడవరం, మాడుగుల, పెందుర్తి నియోజకవర్గాల మీదుగా సాగుతుందన్నారు. దీనికి సంబంధించి రూట్‌మ్యాప్‌ దాదాపు ఖరారైందని చెప్పారు. ప్రతి నియోజకవర్గంతో ఒక బహిరంగ సభ నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. మొత్తానికి వైజాగ్ లో జ‌గ‌న్ పాద‌యాత్ర చేరుకుంటే అక్క‌డ ఎంత మంది వైసీపీ తీర్ధం తీసుకుంటారో చూడాలి.