మంత్రి ఇలాఖాలో జ‌గ‌న్ పాద‌యాత్ర

422

వైసీపీ అధినేత జ‌గన్మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర 220 వ రోజు ప్రారంభం అయింది..పెద్దాపురం నియోజకర్గంలోని సామర్లకోట ప్రసన్నాంజనేయ నగర్‌ నుంచి పాదయాత్ర కొనసాగించారు జ‌గ‌న్ .. ఆయనతో కలిసి నడిచేందుకు వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు.. జ‌గ‌న్ కు జిల్లాలో జ‌నం బ్ర‌హ్మ‌రథం ప‌డుతున్నారు.

Image result for jagan padayatra

ఇప్ప‌టికే పాద‌యాత్ర‌లో ప్ర‌జ‌లు, జ‌గ‌న్ ఇస్తున్న హామీలు విని ఆయ‌న వెంట న‌డుస్తున్నారు.. న‌వ‌రత్నాల‌పై ఇప్ప‌టికే జ‌నంలో ఓ పాజిటీవ్ టాక్ వ‌చ్చింది. జ‌గ‌న్ కు పాద‌యాత్ర పొడ‌వునా ప‌లు స‌మ‌స్య‌ల‌పై జ‌నాలు జ‌గ‌న్కు విన్నవించుకుంటున్నారు..ఈ సాయంత్రం పెద్దాపురం వేములవారి సెంటర్‌లో నిర్వహించే బహిరం‍గ సభలో వైఎస్‌ జగన్‌ పాల్గొంటారు.

Image result for jagan padayatra

ఇక మంత్రి ఇలాఖా అయిన పెద్దాపురంలో జ‌గ‌న్ పాద‌యాత్ర చేర‌డంతో ఇప్పుడు ఇక్క‌డ మంత్రికి ఎటువంటి చుర‌క‌లు జ‌గ‌న్ అంటిస్తారా అని ఎదురుచూస్తున్నారు జ‌నం… వేరే సెగ్మెంట్ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డకు వ‌చ్చిపోటి చేసిన మంత్రి రాజ‌ప్ప‌కు, ఇక్క‌డ ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు… ఏకంగా సీఎం చంద్ర‌బాబు ఆయ‌న సేవ‌ల‌కు, హూంమంత్రి డిప్యూటీ సీఎం ప‌ద‌వి కూడా ఇచ్చారు. మ‌రి జ‌గ‌న్ ఇక్క‌డ ఎటువంటి రాజ‌కీయ ఎత్తులు వేస్తారా అనేది చూడాలి.