నాడు వైయ‌స్ఆర్ నేడు జ‌గ‌న్ సేమ్ సీన్ రిపీట్

378

విశాఖ జిల్లాలో వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర జ‌న‌సందోహంతో సాగుతోంది. ప్ర‌తీ ఒక్కరి స‌మ‌స్య‌లు వింటూ వైయ‌స్ జ‌గ‌న్ ముందుకు వెళుతున్నారు.. తాము అధికారంలోకి వ‌స్తే దివ్యాంగుల‌కు నెల‌కు మూడు వేలు పించ‌న్ అందిస్తాము అని జ‌గ‌న్ హామీ ఇచ్చారు.. దారిలో దివ్యాంగుల పిల్ల‌ల‌తో మాట్లాడి వారి స‌మ‌స్య‌లు తెలుసుకున్నారు.. వారికి అండ‌గా ఉండాలని ఎటువంటి స‌మస్య వ‌చ్చినా పార్టీ త‌ర‌పున సాయం చెయ్యాలి అని తెలియ‌చేశారు.

Image result for ysr padayatra

రామన్నపాలెంలో ఏపీటీఎఫ్‌ నాయకులు జగన్‌ను కలిసి సీపీఎస్‌ రద్దుకు సహకరించాలని వినతిపత్రం ఇచ్చారు. తాను అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సీపీఎస్ ను రద్దు చేస్తానని జగన్‌ చెప్పారు.. సెజ్‌, నేవల్‌బేస్‌ నిర్వాసితులు, ఎన్‌టీపీసీ కాలుష్య సమస్యలను పరిష్కరిస్తానన్నారు. ఎలమంచిలి నియోజకవర్గ క్రైస్తవ నాయకులు జగన్‌ను కలిసి తమ సమస్యలపై వినతిపత్రం ఇచ్చారు…. 2003లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాదయాత్రలో భాగంగా సానికాలువ గ్రామంలో సేదదీరిన చెట్టు వద్ద పూలమాలలతో జగన్‌కు మహిళలు స్వాగతం పలికారు.

Image result for ysr padayatra

ఆయన జ్ఞాపకార్థం వైఎస్ ఆర్‌ చిత్రపటానికి జగన్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు. పాదయాత్రలో ఉన్న జగన్‌ను నేదురుమల్లి రామ్‌కుమార్‌, మాజీమంత్రి బొత్స సత్యనారాయణ కలిశారు. యలమంచిలి వైసీపీ సమన్వయకర్త యు.వి.రమణమూర్తిరాజు పాదయాత్రలో పాల్గొన్నారు. మొత్తానికి నేదురుమ‌ల్లి ఆనం ఫ్యామిలీలు వైసీపీ ఎంట్రీ అనే మాట‌తో మ‌రోసారి వైసీపీ హుషారులో ఉంది అనే చెప్పాలి.