విశాఖ‌లో ప్ర‌వేశించిన జ‌గ‌న్ పాద‌యాత్ర

377

వైసీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర తూర్పుగోదావ‌రి జిల్లా నుంచి ఇప్పుడు విశాఖ జిల్లాకు చేరుకుంది..నాతవరం మండలం గన్నవరం మెట్ట వద్ద ఆయన జిల్లాలోకి ప్రవేశించారు…. పెద్ద ఎత్తున జిల్లా నేత‌లు జిల్లా ఎమ్మెల్యే- ఇంచార్జ్ లు ఆహ్వానం ప‌లికారు..గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ ఈ జిల్లాలో అనుకున్న అన్ని సీట్లు సాధించ‌లేదు..Image result for jagan padayatra in visakha imagesదీంతో ఈసారి కచ్చితంగా విజ‌యానికి దారులు చూడాలి అని భావిస్తోంది.జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో నేతల మధ్య వర్గపోరును జ‌గ‌న్ పాద‌యాత్ర తొల‌గిస్తుంది అని భావిస్తున్నారు నాయ‌కులు.విశాఖ రూరల్‌, నగర, పార్లమెంట్‌ నియోజకవర్గాలకు వేర్వేరుగా పార్టీ అధ్యక్షులు ఉన్నారు… అలాగే మూడు పార్లమెంట్‌ నియోజకవర్గాలకు సమన్వయకర్తలుగా మరో ముగ్గురు ఉన్నారు.

Image result for jagan padayatra in visakha images

ఈ పాద‌యాత్ర‌లో మొత్తం ఈజిల్లాలో పార్టీలో ఉన్న లుక‌లుక‌లు అన్నీ స‌మిసిపోతాయి అని భావిస్తున్నారు…. పార్టీలో ఎటువంటి వివాదాలు లేకుండా పాద‌యాత్ర పూర్తి అయ్యేస‌రికి ఓ నిర్ణ‌యం తీసుకోనున్నారు అని తెలుస్తోంది.పార్టీ జాతీయ కార్యదర్శి హోదాలో విజయసాయిరెడ్డి స్వయంగా జిల్లాలో పార్టీ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు… దీంతో ఆయ‌న కూడా పాద‌యాత్ర‌లో జ‌గ‌న్ వెంట న‌డిచే అవ‌కాశం ఉంది అని తెలుస్తోంది.