బ‌ట్ట‌బ‌య‌లైన జ‌గ‌న్ పీఏ వ్య‌వ‌హారం రంగంలోకి పోలీసులు షాక్ లో జ‌గ‌న్

433

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇటీవలి కాలంలో… రాజకీయ వ్యవహారాలు రచ్చకెక్కుతున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో… సమన్వయకర్తల నుంచి నిధుల వసూలు చేయడం, ఇవ్వని వారిని..మార్చేయడం వంటి పద్దతులు చోటు చేసుకుంటున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పదుల సంఖ్యలో నేతలు.. తమను జగన్ కోట్లకు కోట్లు అడిగారని.. అవి ఇవ్వకపోయే సరికి.. ఇతర నేతల్ని తీసుకొచ్చి… సమన్వయకర్తలుగా నియమించారని.. అంతర్గతంగా ఆవేదన చెందుతున్న వీడియోలు సోషల్ మీడియాలో ఆన్‌లైన్‌లో చక్కర్లు కొట్టాయి. ఇప్పుడు… దీనికి సంబంధించి కొన్ని వివరాలు బయటకు వస్తున్నాయి. తాజాగా అనంత‌పురం జిల్లాలో ఓ వైసీపీ ఇంచార్జ్ ఇదే విష‌యాన్ని త‌న సన్నిహితులు పార్టీ నేత‌ల వ‌ద్ద చెబుతూ, బాధ‌ప‌డిన వీడియోలు కూడా బ‌య‌ట‌కు వ‌చ్చిన‌వి చూశారు చాలా మంది.

Image result for jagan

తాజాగా వైసీపీకి సంబంధించి మ‌రో కీల‌క వార్త ఇప్పుడు ఇంట‌ర్న‌ల్ స‌ర్కిల్ లో పెద్ద వైర‌ల్ అయింది.. హైదరాబాద్‌లో వైసీపీ ఐటీ సెల్ నాయకుడు హర్షవర్ధన్ రెడ్డి, లీగల్ సెల్ అధ్యక్షుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి పోలీసులకు ఓ ఫిర్యాదు చేశారు. దాని ప్రకారం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పీఏ నాగేశ్వర్ రెడ్డి పేరును, ఫోన్ నెంబర్‌ను దుర్వినియోగం చేస్తూ ఆయన పేరుతో పార్టీ నేతలకు ఫోన్లు, మెస్సేజీలు పంపిస్తూ డబ్బులు డిమాండ్ చేస్తున్నారనేది.. ఆ ఫిర్యాదు లో తెలియ‌చేశారు… ఆ ఫోన్ నెంబర్ లోటస్ పాండ్ అడ్రస్‌తో నమోదై ఉందని.. అందుకే హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశామని.. వైసీపీ నేతలు చెబుతున్నారు… అయితే.. ఫోన్ నెంబర్ ఒక్కటే ఉంటుంది.. ఆ ఫోన్ నెంబర్ నుంచి ఫోన్ వెళ్లింది అంటే.. అది వాళ్లు చేసినట్లే లెక్క. లేకపోతే.. ఆ ఆఫోన్ ఇతరులకు అయినా ఇచ్చి ఉండాలి. అది తెలుసుకోవడం పెద్ద విషయం కాదు. మరి పోలీసుల వరకూ వైసీపీ నేతలు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది..? అనేది చాలా మందికి అనుమానం వస్తున్న ప్రశ్న. ఇక అదే ఫోన్ నెంబర్ తో మ‌రో నెట్ వ‌ర్క్ కాల్ వ‌స్తుందా అనే అనుమానం పార్టీ త‌ర‌పున ముందు పెడుతున్నారు నాయ‌కులు.

మ‌రి ఈ విష‌యంలో జ‌గ‌న్ పార్టీ మాత్రం కేసు పెట్టింది.. అయితే ఇందులో వాస్త‌వాలు తెలుసుకోవాలి అని పోలీసుల‌కు కంప్లైంట్ ఇచ్చారు, దీనిపై విచార‌ణ చేస్తున్నామ‌ని ఇందులో వాస్త‌వాలు ఏమిటి అని తెలుసుకుంటాము అని చెప్పారు పోలీసులు. మ‌రి చూశారుగా ఈ అంశంలో త‌ప్పు ఎవ‌రిది అయి ఉంటుంది అని భావిస్తున్నారు, అస‌లు ఇది సాధ్య‌మ‌య్యే ప‌నేనా మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.