కాపులకు రూ.10 వేల కోట్లు జ‌గ‌న్ అన్ లిమిటెడ్ హామీలు

425

వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కాపుల విష‌యంలో మ‌రింత ముందుకు నిర్ణ‌యాల‌తో వెళుతున్నారు.. రెండు రోజుల క్రితం చేసిన వ్యాఖ్య‌ల‌తో కాపులు పార్టీ నుంచి దూరం అవుతున్నారు అని గ్ర‌హించారు జ‌గ‌న్.. ఇక పార్టీలో ఉన్న కాపు నాయ‌కులు కూడా వ్య‌తిరేకం అవుతున్నారు అని భావించి, న‌ష్ట‌నివార‌ణ చర్య‌లు ప్రారంభించారు.పిఠాపురం సభలో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్ కీల‌క హామీ ఇచ్చారు కాపుల‌కు..

 

బాబూ.. కాపులను మోసం చేసింది నువ్వా.. నేనా అని నిల‌దీశారు.. కాపుల‌ను ఏపీ ప్ర‌జ‌ల‌ను ఎవరు మోసం చేశారో ప్రతి కాపు సోదరుడికీ తెలుసు… మీరు అధికారంలోకి రాగానే ఆరు నెలల్లో కాపులకు రిజర్వేషన్‌ కల్పిస్తామన్నారు.. నాలుగున్నరేళ్లు అయింది.. ఏం చేశారు ఇప్ప‌టికీ ఏమీ తేల్చ‌లేదు అని ఆయ‌న ప్ర‌శ్నించారు. కాపుల‌కు ఐదు వేల కోట్ల రూపాయ‌లు ఇస్తాము అని అన్నారు..కాని ఇప్ప‌టికీ .1,340 కోట్లు మాత్రమే ఇచ్చి వంచించింది మీరు కాదా ఇది కాపులకు తెలియ‌దా అని ప్ర‌శ్నించారు ఆయ‌న‌….మీలా అబద్ధాలు చెప్పలేను.. ఏం చేయగలనో అదే చెబుతాను.. ఎల్లో మీడియా అండగా నా మాటలను దారుణంగా వక్రీకరిస్తారా అని ఆయ‌న ప్రశ్నించారు.

మీలా యూ టర్న్‌ మా ఇంటా వంటా లేదు అలా యూట‌ర్న్ తీసుకునే వ్య‌క్తిత్వం కాదు…రాష్ట్రంలో జన్మభూమి కమిటీల మాఫియా న‌డుస్తోంద‌ని ఆయ‌న విమ‌ర్శించారు… జగన్‌ అనే నేను.. అధికారంలోకి రాగానే రూ.5 వేల కోట్లను రూ.10 వేల కోట్లకు పెంచుతానని చెప్పడం మోసమా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు… కాపుల‌కు ప‌దివేల కోట్లు కేటాయిస్తామ‌ని వెల్ఫేర్ కు అలాగే కార్పొరేష‌న్ కు ప‌దివేల కోట్లు కేటాయిస్తాము అని అధికారంలోకి రాగానే ఈ ప‌ని క‌చ్చితంగా చేస్తాము అని తెలియ‌చేశారు జ‌గ‌న్.. మొత్తానికి జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న‌తో ఇటు తెలుగుదేశం కూడా ఆలోచ‌న‌లో ప‌డింది.