జ‌గ‌న్ అర్ధ‌రాత్రి కీల‌క నాయ‌కుడితో భేటీ టెన్ష‌న్ లో చంద్ర‌బాబు ఏపీలో ఫ‌లితాల‌ ముందు జ‌గ‌న్ కొత్త ప్లాన్

236

ఏపీ రాజ‌కీయాల్లో ప్రస్తుతం పోల‌వ‌రం వేడి రోజు రోజుకు రాజుకుంటున్న సంగ‌తి తెలిసిందే. గ‌త ఐదేళ్ల కాలంలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం చేప‌ట్టిన పోల‌వ‌రం నిర్మాణం ప‌నుల‌పై కాంగ్రెస్ నేత కేవీపీ ఘాటు వ్యాఖ్య‌లు చేయ‌గా, అందుకు స్పందించిన మంత్రి దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర‌రావు కౌంట‌ర్ ఇచ్చారు. కాగా, ఈ రోజు కాంగ్రెస్ నేత కేవీపీ మీడియాతో మాట్లాడుతూ పోల‌వ‌రం ప్రాజెక్టు విష‌యంలో తాను పెట్టుకున్న భ‌యాల‌న్నిటిని చంద్ర‌బాబు ప్ర‌భుత్వం నిజం చేసింద‌ని, చంద్ర‌బాబు ప్ర‌భుత్వం పోల‌వ‌రం ప్రాజెక్టు విష‌యంలో అవినీతికి పాల్ప‌డిందని, ఆ అవినీతిని అడ్డుకునేందుకు తాను చేసిన ప్ర‌య‌త్నాల‌న్నీ విఫ‌ల‌య‌త్నాలుగానే మిగిలిపోయాయ‌ని కేవీపీ అన్నారు.

ఈ క్రింది వీడియో చూడండి

కేవీపీ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన మంత్రి దేవినేని ఉమా మీడియాతో మాట్లాడుతూ కేవీపీపై ఫైర‌య్యారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో, ఏపీలో వైసీపీలో ఉంటావంటూ ఎద్దేవ చేశారు. మ‌రోప‌క్క దివంగ‌త సీఎం రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ఆత్మగా, కేసీఆర్‌కు ఆత్మ బంధువుగా ఉంటావు.., అలాగే, వైఎస్ జ‌గ‌న్‌కు లోటస్‌పాండ్‌లో అర్ధ‌రాత్రి శ్రేయోభిలాషి అంటూ కేవీపీపై మంత్రి దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర‌రావు విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించారు.

Image result for jagan

జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేత చెంప‌దెబ్బ‌లు తిన్న వ్య‌క్తి కేవీపీ అని, మ‌ళ్లీ అటువంటి వ్య‌క్తే జ‌గ‌న్ వ‌ద్ద‌కు వెళ్ల‌డం సిగ్గుచేట‌న్నారు. చంద్ర‌బాబు నాయ‌క‌త్వంలో పోల‌వ‌రం ప్రాజెక్టును దాదాపు పూర్తి ద‌శ‌కు తీసుకొచ్చినందుకు తామెంతో గ‌ర్వ‌ప‌డుతున్నామ‌ని మంత్రి దేవినేని అన్నారు. చ‌చ్చినా, బ‌తికినా త‌మ‌కు ఈ జ‌న్మ‌లో చెప్పుకునేందుకు ఈ గ‌ర్వ‌కార‌ణం చాల‌ని, చంద్ర‌బాబు నాయుడుపై విషం చిమ్ముతున్నావంటే అస‌లు నీవు అన్నం తింటున్నావో.. గ‌డ్డి తింటున్నావో అర్ధం కావ‌డం లేదంటూ కేవీపీపై దేవినేని ఉమా మ‌హేవ్వ‌ర‌రావు ధ్వ‌జ‌మెత్తారు.