మాటకు మాట: పవన్ కల్యాణ్ భార్య ల పై సంచలన కామెంట్లు చేసిన జగన్

410

ఏ తెలంగాణ‌లో ఎన్నిక‌ల హీట్ ఉంటే ఇప్పుడు ఏపీలో కూడా పొలిటిక‌ల్ గా హీట్ పెరిగిపోయింది. ఓప‌క్క ప‌వ‌న్ మ‌రో ప‌క్క జ‌గ‌న్ ఇద్ద‌రు విమ‌ర్శ‌లు చేసుకుంటూ ఒక‌రిని ఒక‌రు విమ‌ర్శించుకుంటున్నారు.. వరుసగా తనపై విమర్శలు గుప్పిస్తున్న జనసేన అధిపతి పవన్‌ కల్యాణ్‌పై విపక్షనేత జగన్‌ విరుచుకుపడ్డారు. ఇదేనా నీ మగతనం?’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా జగన్‌ శ్రీకాకుళం జిల్లా రాజాంలో జరిగిన సభలో ప్రసంగించారు. పవన్‌ ఇప్పటిదాకా తనపై చేస్తున్న విమర్శలకు గట్టిగా కౌంటర్‌ ఇచ్చారు. ఈ పెద్దమనిషి పవన్‌ కల్యాణ్‌ ఇటీవలికాలంలో మగతనం గురించి మాట్లాడుతున్నారు. నిత్య పెళ్లికొడుకులా, నాలుగేళ్లకోసారి కారును మార్చినట్లు భార్యను మార్చడమే మగతనమా? తనతో కాపురం చేస్తూనే మరో స్త్రీని గర్భవతిని చేసి, పిల్లాడిని ఇంటికి తీసుకొచ్చారని పవన్‌ రెండో భార్య రేణూ దేశాయ్‌ టీవీల ముందుకు వచ్చి చెప్పారు. తనతో జీవితాన్ని పంచుకున్న ఆమెను అభిమానులు సోషల్‌ మీడియాలో వేధిస్తుంటే మౌనంగా ఉండటమే మగతనమా? పెళ్లి అనే పవిత్రమైన వ్యవస్థను పవన్‌ కల్యాణ్‌ రోడ్డుమీదికి తీసుకొచ్చారు.

Image result for pawan kalayanఇది తప్పు అని ఎవరైనా ఎత్తిచూపితే వారి ఇళ్లలోని ఆడవాళ్ల మీద సిగ్గులేకుండా సోషల్‌ మీడియాలో లేనిపోని అబద్ధాలతో పోస్టింగ్‌లు పెట్టిస్తాడు. ఇది మగతనమా?’’ అని పవన్‌ను జగన్‌ నిలదీశారు. పవన్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు స్ర్కిప్టును చదువుతూ, ఆయన డైరెక్షన్‌లో నడుచుకుంటున్నారని ఆరోపించారు. ఒకవైపు రాజధానిలో భూసమీకరణ బాధితుల తరఫున పోరాడుతున్నట్లు ప్రచారం చేసుకుంటారు. మరోవైపు… అదే పూలింగ్‌లో తన భూములు పోకుండా కాపాడుకున్న లింగమనేని నుంచి ఎకరా కోట్లు పలికే భూమిని రూ.20 లక్షలకే కొనుగోలు చేశారు. ఇది అవినీతి కాదా? అయ్యా పవన్‌ కల్యాణ్‌… మీరు తీసిన అజ్ఞాత వాసికి చంద్రబాబు మరే సినిమాకూ ఇవ్వనన్ని రాయితీలు ఇవ్వలేదా? దాని ద్వారా కోట్లు సంపాదించుకోవడం అవినీతి కాదా? ఇలాంటి పవన్‌ కల్యాణ్‌ అవినీతి గురించి, నా గురించి మాట్లాడుతున్నారు.అని జ‌గ‌న్ ప‌న‌వ్ పై విమ‌ర్శ‌లు చేశారు.

Image result for jagan

ఇది వరకు ముందే జగన్ పవన్ మీద వ్యక్తిగత ఆరోపణలు చేస్తే అది ఎంత తీవ్ర రూపం దాల్చిందో అందరికి తెలుసు.ఆ సమయంలో జగన్ తీరు సరికాదని రాజకీయ విశ్లేషకులు కూడా చెప్పారు. రాజకీయ పరంగా విమర్శలు ఉండాలే తప్ప అవతలి వారి యొక్క వ్యక్తిగత జీవితానికి సంబందించి విమర్శలు చెయ్యడం సభ్యత కాదు అని జనసేన శ్రేణులు కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.అయితే గత కొద్ది రోజులు నుంచి పవన్ జగన్ మీద చేస్తున్న విమర్శలకు గాను జగన్ మరింత స్థాయిలో రెచ్చిపోయి పవన్ మీద మరోసారి వ్యక్తిగత విమర్శలు చేసారు అని చెబుతున్నారు విశ్లేష‌కులు. మ‌రిచూశారుగా ఈ విషయంలో జ‌గ‌న్ కామెంట్ ల పై మీ అభిప్రాయాన్ని కామెంట్ల‌రూపంలో తెలియ‌చేయండి.