జ‌గ‌న్ కు అంతా తెలుసు ప‌ర‌మేశ్వ‌ర‌రెడ్డి భార్య సంచ‌ల‌న కామెంట్లు

264

వైయ‌స్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో రోజుకో కొత్త వార్త వినిపిస్తోంది, ముఖ్యంగా జ‌గ‌న్ కు అత్యంత స‌న్నిహితుడు రాజ‌కీయంగా తోడు ఉన్న‌టు వంటి వివేకానంద‌రెడ్డి హ‌త్య అవ్వ‌డం పెద్ద ఎత్తున పులివెందుల క‌డ‌ప‌జిల్లాలో చ‌ర్చ‌కు దారితీసింది. ముఖ్యంగా ఎవ‌రైనా నాయ‌కులు ఆయ‌న స‌న్నిహితులు క‌నిపించ‌కుండా పోయిన కార‌ణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచార‌ణ మ‌రింత ముమ్మ‌రం చేశారు.

Image result for ys vivekananda reddy letter

వైఎస్ వివేకానందరెడ్డి హత్య తరువాత కనిపించకుండా పోయిన ఆయన సన్నిహితుడు పరమేశ్వర్‌రెడ్డి తిరుపతిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వివేకా హత్యకేసులో పరమేశ్వరరెడ్డి పేరు బయటకు రావడంతో.. ఏవరీ పరమేశ్వర్‌రెడ్డి అనే సందేహం మొదలైంది. పులివెందుల సమీపంలోని కసనూరుకు చెందిన పరమేశ్వర్‌రెడ్డి సెటిల్‌మెంట్లు, భూ వివాదాలు పరిష్కరించేవాడని, వివేకాతో అత్యంత సన్నిహితంగా మెలిగేవాడని, ఇటీవల ఓ వివాదంలో పరమేశ్వర్‌తో వివేకా గొడవపడ్డాడని, వివేకా హత్యకు పది రోజుల ముందు త్వరలో ఓ సంచలనం చూస్తారంటూ పరమేశ్వర్‌ కొందరి వద్ద మాట్లాడాడని ప్రచారం జరిగింది. దీనికి తోడు వివేకా హత్య తర్వాత పరమేశ్వర్‌రెడ్డి చూడడానికి కూడా రాలేదంటూ ఆయనపై ఆరోపణలు వచ్చాయి. తనపై వస్తున్న ఆరోపణలపై మీడియాతో పరమేశ్వరరెడ్డి మాట్లాడారు. వివేకానందరెడ్డితో తనకు 30 ఏళ్లుగా పరిచయం ఉందని పరమేశ్వర్‌రెడ్డి తెలిపారు. తనకు ఆరోగ్యం బాగోలేక ఆసుపత్రిలో చేరానని, వివేకా హత్యతో తనకు సంబంధం లేదని చెప్పారు.

పరమేశ్వర్‌రెడ్డి భార్య సుభాషిణి మాట్లాడుతూ..‘‘వివేకా హత్యతో నా భర్తకు ఎలాంటి సంబంధం లేదు. 30 ఏళ్లుగా వాళ్ల కోసమే పనిచేస్తున్నాం. కావాలనే మాపైన పుకార్లు పుట్టించారు. అయినా ఎవరు ఎలాంటి వారో జగన్‌సార్‌కు తెలుసు. నా భర్త ఆ పని చేశాడని తేలితే వాళ్ల ఆఫీసు ముందు నా గొంతు కోసుకుంటా’’ అన్నారు. పోలీసులు వచ్చి అడిగారని, ‘ఇంటి దొంగలే చేశారు. తేల్చుకోండి’ అని చెప్పామని ఆమె అన్నారు. తన భర్తకు ఆరోగ్యం సరిగ్గా లేకపోతే కర్నూలు ఆసుపత్రికి తీసుకెళ్లామని, మెరుగైన చికిత్స కోసం తిరుపతికి వచ్చామని సుభాషిణి చెప్పారు. ‘‘వైసీపీకో దండం.. మా బతుకు మేం బతుకుతాం’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్తకు పోలీసుల భద్రత కల్పించాలని కోరారు.