టీడీపీకి అదిరిపోయే కౌంట‌ర్ వేసిన జ‌గ‌న్

505

వైసీపీ అధినేత ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర తూర్పుగోదావ‌రిజిల్లాలో కొన‌సాగుతోంది.. ఈ స‌మ‌యంలో అధికార పార్టీపై ఆయ‌న విమ‌ర్శ‌ల బాణాలు వ‌దులుతున్నారు.. సీఎం చంద్ర‌బాబు ప్ర‌జ‌ల‌కు ఈ నాలుగు సంవ‌త్స‌రాలు చేసింది ఏమీ లేదు అని ఆయ‌న విమ‌ర్శ‌లు చేశారు.. కాకినాడ‌లో జ‌రుగుతున్న ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌కు ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున నీరాజ‌నాలు ప‌లికారు.. ఇక్క‌డ బీసీ – కాపు సామాజిక‌వ‌ర్గం ఎక్కువ‌గా ఉంటుంది, వీరు ఎంత పెద్ద ఎత్తున మ‌ద్ద‌తు తెలిపారో ఆయ‌న పాద‌యాత్రకు వ‌స్తున్న జ‌న సందోహంతో తెలుస్తోంది.


తమ ఎమ్మెల్యేలను పశువుల్ని కొన్నట్లు కొన్నారని సీఎం చంద్ర‌బాబు పై తెలుగుదేశం నేత‌ల‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు…కాకినాడలో ఏకంగా పైపులైన్లకు కన్నంవేసి ఆయిల్ దొంగతనాలు చేస్తున్నారన్నారు. ఇక్క‌డ ఇసుక మాఫియాను ఆయిల్ మాఫియాను అడ్డుకోవ‌డం లేద‌ని బాబు వెన్నంటి వారికి ఉండ‌టం వ‌ల్లే ఇటువంటి దైర్యం వారికి వ‌స్తోంది అని అన్నారు.


ఇక్క‌డ పోలీసులు కూడా వీటిపై ప్రేక్ష‌కపాత్ర వ‌హిస్తున్నారు…రాజకీయ నాయకులు లంచాలు తీసుకొని ఉద్యోగాలు ఇప్పించినట్టు కన్పిస్తోందన్నారు జ‌గ‌న్ .. ఇక ఏ ప్రాంతంలో చూసినా క‌బ్జాలు పెరిగిపోతున్నాయి అని ఆయ‌న విమ‌ర్శించారు.. కాస్త ప్రైవేట్ జాగా క‌నిపిస్తే క‌బ్జా చేస్తున్నార‌ని, ఇక కాకినాడ‌లో ఎటు చూసినా పేకాట క్ల‌బ్బులు పెరిగిపోయాయి.. వీట‌ని నియంత్రించాల్సిన ప్ర‌భుత్వం మాముళ్లు తీసుకుని వాటిని వ‌దిలేసింది అని జ‌గ‌న్ విమ‌ర్శ‌లు చేశారు.