అలికి బంపర్ ఆఫర్ ఇచ్చిన జగన్.. జనసేన లో ఎందుకు చేరలేదంటే?

182

సినీ న‌టుడు అలీ వైసిపి లో చేరారు. కొంత కాలంగా ఆయ‌న ఏ పార్టీలో చేరుతార‌నే దాని పై స‌స్పెన్స్ కొన‌సాగింది. ఆలీ కి టిడిపి నుండి టిక్కెట్ ఖ‌రారైంద‌ని ప్ర‌చారం జ‌రిగింది. సరిగ్గా ఇదే స‌మ‌యంలో ఊహించ‌ని విధంగా ఆలీ వైసిపి లో చేరేం దుకు మొగ్గు చూపారు. వైసిపి లో చేరిన స‌మ‌యంలో జ‌గ‌న్ ఇచ్చిన హామీకి ఆలీ సంతృప్తి చెందారు..స‌రిగ్గా 20 ఏళ్ల క్రితం టిడిపిలో చేరాన‌ని..అప్పుడు ఆ పార్టీ కండువా క‌ప్పుకుంటే..ఇప్పుడు వైసిపి లో చేరి ఈ పార్టీ కండు వా క‌ప్పుకున్నాన‌ని ఆలీ చెప్పారు. లోట‌స్ పాండ్‌లో జ‌గ‌న్ స‌మ‌క్షంలో ఆలీ వైసిపి లో చేరారు. ఆయ‌న జ‌న‌సేన అధినే త ప‌వ‌న్ తో ఉన్న సాన్నిహ‌త్యం కార‌ణంగా జ‌న‌సేన‌లో చేరుతార‌ని ప్ర‌చారం జ‌రిగింది. ఆ త‌రువాత ముఖ్య‌మంత్రితో భేటీ అయ్యారు. ఆయ‌న‌కు గుంటూరు తూర్పు సీటు ఇస్తార‌ని లెక్కలు క‌ట్టారు.

Image result for ali join ysrcp

స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో వైసిపి లో చేరా ల‌ని ఆలీ నిర్ణ‌యించారు.అయితే, జ‌గ‌న్ ఇదే స‌మ‌యంలో ఓ స్ప‌ష్ట‌మైన విష‌యం చెప్పారు. ఈ ఎన్నిక‌ల్లో ఇప్ప‌టికే సీట్ల స‌ర్దుబాటు పై మాట ఇచ్చాన‌ని..పోటీ చేసే అవ‌కాశం ఇవ్వ‌లేన‌ని స్ప‌ష్టంగా చెప్పారు. ఈ ఎన్నిక‌ల్లో పార్టీ విజ‌యం కోసం ప్ర‌చారం చేయాల‌ని..అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత స‌ముచిత ప్రాధాన్య‌త ఇస్తాన‌ని హామీ ఇచ్చారు. దీనికి ఆలీ సైతం అంగీకించారు. తాను జ‌గ‌న్ ను సీయం చేసేందుకు ప్రచారం చేస్తాన‌ని ప్ర‌క‌టించారు.ఆలీ తొలుత జ‌న‌సేన‌..టిడిపిలో చేరుతార‌ని భావించిన ఆ పార్టీల్లో చేర‌లేదు. అయితే, దీనికి ఆలీ స్వ‌యంగా స‌మాధా నం ఇచ్చే ప్ర‌న‌య‌త్నం చేసారు. టిడిపి లో త‌న‌కు భ‌విష్య‌త్ కు భ‌రోసా క‌న్పించ‌లేద‌ని చెప్పుకొచ్చారు. వ‌ప‌న్ తో త‌న కు మంచి రిలేష‌న్ ఉంద‌న్నారు.

ఈ క్రింది వీడియో చూడండి 

స్నేహం వేరు..రాజ‌కీయం వేరు అని వివ‌రించారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానులు మంచివారు, వారికి అంద‌రికి తెలుసు ప‌వ‌న్ క‌ల్యాణ్ కి అలీకి ఎలాంటి రిలేష‌న్ ఉందో అని అలీ చెప్పారు..త‌న‌కు మంత్రి కావాల‌నేది క‌ల అని..ఆ దిశ‌గా ప్ర‌తిపాదించిన విష‌యం నిజ‌మేన‌ని స్ప‌ష్టం చేసారు. త‌న‌ను సోష‌ల్ మీడియా లో ఎవ‌రైనా టార్గెట్ చేస్తే వారిని పిచ్చోళ్లుగా చూస్తాన‌ని చెప్పుకొచ్చారు. తన‌కు చిన్ప‌ప్ప‌టి నుండి వైయ‌స్ కుటుంబంతో సాన్నిహిత్యం ఉంద‌ని.. 2004 లో వైయ‌స్ ముఖ్య‌మంత్రి అవుతార‌ని ఆనాడే ఆయ‌న‌కే చెప్పాన‌ని..ఇప్పుడు జ‌గ‌న్ ను సీయం చేయ‌టం కోసం క‌ష్ట‌ప‌డ‌తాన‌ని చెప్పుకొచ్చ‌రు. జ‌గ‌న్ మాట ఇస్తే త‌ప్ప‌ర‌ని కితాబిచ్చారు. తాను వెంట‌నే ప్ర‌చారం లోకి దిగుతున్న‌ట్లు ఆలీ ప్ర‌క‌టించారు.మ‌రి అలీకి జ‌గన్ ఎలాంటి ప‌ద‌వి ఇస్తారు అనేది చూడాలి.