జ‌గ‌న్‌కి ఊహించ‌ని షాక్ ఇచ్చిన.. వైసీపీ నేత‌లు

166

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో వైసీపీ చావోరేవో అన్న‌ట్టుగా త‌ల‌ప‌డింది. ఈ ఎన్నిక‌ల్లో కూడా సింగిల్‌గానే బ‌రిలో దిగిన వైసీపీ విజ‌యం మీద గంపెడాశ‌తో ఉంది. అయితే వైసీపీ ఇన్న‌ర్ న్యూస్ ఏంటంటే కొన్ని చోట్ల వైసీపీ సీనియ‌ర్ అభ్య‌ర్థుల వ్య‌వ‌హారం, క్రాస్ ఓటింగ్ ప్రోత్స‌హించిన తీరు చివ‌ర‌కు కొంప‌లు ముంచుతుందేమోన‌నే సందేహం క‌లుగుతోందని స‌మాచారం. వైసీపీ తాజా రిపోర్ట్స్ ప్ర‌కారం ఈ విష‌యం వెలుగులోకి వ‌చ్చింద‌ని తెలుస్తోంది. దీంతో నేత‌ల తీరు పై వైసీపీ అధిష్టానానికి ఆగ్ర‌హం క‌ల్గిస్తోంది.

ఈ క్రింది వీడియో చూడండి

తాజా ఎన్నిక‌ల సంద‌ర్భంగా ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించిన చోట్ల కూడా కొంద‌రి వ్య‌వ‌హారం జ‌గ‌న్‌కి అసంతృప్తి క‌లిగించిన‌ట్టు ప్ర‌చారం సాగుతోంది. ఇప్ప‌టికే లోట‌స్ పాండ్‌కి అందిన రిపోర్ట్స్ ప్ర‌కారం ప‌లు చోట్ల ఎమ్మెల్యే అభ్య‌ర్థులు, మ‌రికొన్ని చోట్ల ఎంపీ అభ్య‌ర్థులు క్రాస్ ఓటింగ్ ప్రోత్స‌హించిన తీరు వైసీపీలో క‌ల‌క‌లం రేపుతోంది. దీంతో ఈ వ్య‌వ‌హారం ఫ‌లితాల మీద ప్ర‌భావం చూపుతుందేమోన‌నే సందేహం క‌లుగుతోంది. ఇలా క్రాస్ ఓటింగ్‌కి పాల్ప‌డిన వైసీపీ నేత‌ల‌కు సంబంధించి నివేదిక‌లు రావ‌డంతో జ‌గ‌న్ ఆగ్ర‌హంలో ఉన్న‌ట్టు స‌మాచారం. మ‌రి ఈ క్రాస్ ఓటింగ్ వైసీపీకి ఎలాంటి న‌ష్టం క‌లుగుతుందో అని స‌ర్వ‌త్రా చ‌ర్చించుకుంటున్నారు.