ఏబీఎన్ రాధా కృష్ణకు మరోగట్టి షాక్.

191

ఏపీ రాజకీయ వర్గాల్లో జ్యోతి పత్రిక అన్నా అలాగే ఏబీఎన్ న్యూస్ ఛానెల్ అన్నా తెలీయని వారు ఉండరు.అయితే ఈయన మరియు ఈయన మీడియా ఎవరికి అను”కులం”గా వ్యవహరిస్తుందో కూడా అందరికి తెలుసు.మరి వీరు ఒకరిపై ప్రేమను కురిపిస్తున్నారంటే అవతల వారిపై విషం చిమ్ముతున్నారనే కదా అర్ధం ఇప్పుడు దీనిపైనే సోషల్ మీడియా ప్రజానీకం రాధా కృష్ణపై ఫైర్ అవుతూ దిమ్మతిరిగే ప్రశ్నలు విసురుతున్నారు.తాజాగా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో వైసీపీ పార్టీ పార్టీ అధికారంలోకి వచ్చిన సంగతి అందరికి తెలిసిందే. మరి ఎబీఎన్ కు జగన్ కు పడదు అనేది సత్యం, అసలు తన ప్రెస్ మీట్లు పార్టీ కార్యక్రమాలకు కూడా జగన్ ఈ ఎబీఎన్ మీడియాని ఆహ్వనించరు. నిత్యం జగన్ పై విషం చిమ్ముతారు అనే విమర్శలు వస్తూనే ఉంటాయి. కాని పరిస్దితులు మారిపోయాయి ఇప్పుడు జగన్ సీఎం అయ్యారు.

Image result for jagan

అయితే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాల భర్తీ కొరకు గ్రామ వాలంటీర్ల జాబులు ప్రకటించిన సంగతి తెలిసిందే.అయితే ఈ వాలంటీర్ల ఎంపికలో కేవలం వైసీపీకు అనుకూలంగా ఉండే వ్యక్తులు ఆ పార్టీకు చెందిన వారిని ఆ పార్టీకు మద్దతుదారులను మాత్రమే చేర్చుకుంటున్నారని ఇంటర్వ్యూకు అటెండ్ అయ్యే అభ్యర్థులకు నవరత్నాలు అంటే ఏమిటో తెలిస్తే వారికి ఉద్యోగం ఇచ్చేస్తారని వారి పత్రికలో పెద్ద ఎత్తునే ప్రచారం చేసారు.

ఈ క్రింది వీడియో ని చూడండి

చాలా చోట్ల ఇలాగే ఎంపికలు జరిగిన మాట వాస్తవమే అయినా ఇప్పుడున్న బుద్ది రాధా కృష్ణకు టీడీపీ అధికారంలో ఉన్నపుడు ఏమైందని రాజకీయ విశ్లేషకులు సహా ఇతర పార్టీల శ్రేణులు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు.గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నపుడు ఏర్పాటు చేసిన జన్మభూమి కమిటీలో ఉన్న మొత్తం 15 సూత్రాలు కేవలం టీడీపీ మద్దతు దారులకే అమలు చేసారు దీనిపై ఇప్పుడు రాసినంత పెద్ద వ్యాసాలు ఎందుకు రాయలేకపోయారని విమర్శలు కురిపిస్తున్నారు.అయినా ఇదంతా రాధా కృష్ణకు అలవాటే కదా అని మరికొంత మంది సెటైర్లు వేస్తున్నారు. అసలు ఎందుకు చంద్రబాబుకి రాధా కృష్ణ అంత దగ్గర అయ్యారు జగన్ పై ఎందుకు అంత వ్యతిరేకత అనేఇ చాలా మందికి మదిలో మెదిలే ప్రశ్న కాని చంద్రబాబు ఓటమి తర్వాత తన ఇంటర్వ్యూలను కూడా కొద్ది రోజులుగా ఆపేశారు సో మరిఎప్పుడు స్క్రీన్ పై ఆర్కే కనిపిస్తారా అని తెలుగుదేశం శ్రేణులు చూస్తున్నారు కాని జగన్ ఆరునెలల పాలన చూసిన తర్వాత మళ్లీ తెలుగుదేశంలో ఓడిన ఎమ్మెల్యేలు మాజీ మంత్రులను తీసుకువచ్చి ఇంటర్వ్యూలు చేస్తారు అని అంటున్నారు సో చూడాలి ఆర్కే వర్సెస్ సీఎం జగన్ , ఏపీపాలన ఎలా ఉండబోతోందో ఏపీ రాజకీయాల్లో.