విజ‌య‌సాయిరెడ్డికి కొత్త పోస్టు ఇచ్చిన జ‌గ‌న్

399

వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి రాజ‌కీయంగా తీసుకునే నిర్ణ‌యాలు పార్టీ కేడ‌ర్ కు కొత్త హుషారు తెప్పిస్తున్నాయి…తాజాగా వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పార్టీలో కీల‌కంగా ఉండే నాయ‌కుడు ఎంపీ విజ‌య‌సాయిరెడ్డికి కొత్త బాధ్య‌త‌లు అప్ప‌గించారు…ఆయ‌న ఇప్ప‌టికే పార్టీలో నెంబ‌ర్ 2 గా వ్య‌వ‌హ‌రిస్తారు అనే ప్ర‌శంస ఉంది.. ఇక ఆయ‌నకు వైసీపీ అధినేత హ‌స్తిన‌లో కొత్త బాధ్య‌త‌లు అప్ప‌గించారు..

Related image
ఏపీకి ప్ర‌త్యేక హూదా సాధ‌న కోసం వైయ‌స్సార్ సీపీ ఎంపీలు త‌మ ఎంపీ ప‌ద‌వుల‌కు రాజీనామాల చేసి, ఆమ‌ర‌ణ‌ నిరాహార‌దీక్ష చేసిన సంగ‌తి తెలిసిందే. ఇక ఎంపీలు ఇప్పుడు స‌భ‌లో లేక‌పోయినా వారి పోరాటం మాత్రం కొన‌సాగిస్తున్నారు.

Image result for vijaya sai reddy ysrcp

ఇక పార్ల‌మెంట్లో వైసీపీ త‌ర‌పున కీల‌క నాయ‌కుడు ఎంపీ మేక‌పాటి రాజ‌మోహ‌న్ రెడ్డిని గ‌తంలో జ‌గ‌న్ పార్ల‌మెంట‌రీ నేత‌గా నియ‌మించారు..అయితే ఈ రాజీనామాల‌తో ఇక స‌భ‌లో ఎంపీలు లేరు.. దీంతో రాజ్య‌స‌భ‌లో ఉన్నా విజ‌యసాయిరెడ్డిని తాజాగా వైసీపీ పార్ల‌మెంట‌రీ నేత‌గా జ‌గ‌న్ నియ‌మించారు.. ఈ నియామ‌కానికి సంబంధించి ఓ నియామ‌క ప‌త్రం పార్టీ విడుద‌ల చేసింది.

Related image

పార్టీ ఫ్లోర్ లీడ‌ర్లు పార్టీ పార్ల‌మెంట‌రీ నేత‌ల విష‌యాలు నియామ‌కాలు పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి అనంతకుమార్‌కు తెలియ‌చేయాలి… దీంతో ఆయ‌న‌కు ఈ విష‌యాన్ని పార్టీ తెలియ‌చేసింది… అలాగే , రాజ్యసభ, లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు లేఖను అందజేసింది వైసీపీ.. ఇక పార్లమెంట్లో వైసీపీ త‌ర‌పున గ‌ళం విప్పేందుకు ఇద్ద‌రు రాజ్య‌స‌భ స‌భ్యులు ఉన్నారు.