హిందూపురంలో బాలయ్యకు చుక్కలు చూపించిన జగన్ అభిమానులు..

130

హిందూపురం నియోజకవర్గం..బాగా ఆసక్తి రేపుతున్న నియోజకవర్గం..దానికి కారణం ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ..ఐదేళ్ళు గడిచిపోయాయి.. అప్పుడు బాలయ్య కు ఉండే క్రేజ్ ను చూసి జనాలు ఓటేసారు..అయితే ఇప్పుడు బాలయ్య ఐదేళ్ళ పనితీరుమీద ఇప్పుడు ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు..బాలయ్య ఏఇదేళ్ళు ఎమ్మెల్యేగా వ్యవహరించిన తరువాత కూడా హిందూపురంలో పెద్దగా మార్పేమీ కనిపించదు..ప్రధాన రహదారులు కూడా అంతే అధ్వాన్నంగా ఇరుకుగా ఉన్నాయి..20 ఏళ్ళ క్రిందట హిందూపురం ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంది..మెయిన్ టవున్ ను సుందరీకరించే పనులు ఏ మాత్రం జరిగినట్టుగ కనిపించవు..

అయితే జనావాస ప్రాంతాల్లో రోడ్లు గట్రా బాగానే పడ్డాయి..ఇంక నీటి సౌకర్యం విషయంలో ఇబ్బందులు ఉన్నాయని స్థానికులు చెబుతూ ఉన్నారు..ప్రధానంగా పల్లెల్లో ఈ కంప్లైంట్ తీవ్రంగా ఉంది..బాలకృష్ణ చేసిన కొద్దో గొప్పో అభివృద్ధి కేవలం టౌన్ లోనే అని పల్లేలను ఏ మాత్రం పట్టించుకోలేదని వారు చెబుతూ ఉన్నారు..స్థానికంగా ముస్లిముల జనాభా గణనీయంగా ఉంది..ఎన్నికల ముందు మాజీ ఎమ్మెల్యే ఘని తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు..ఈయనకంటూ ఒక వర్గమైతే ఉంది..ఘని పోటీకి వెనకడుగు వేయడంతో ఇక్బాల్ ను రంగంలోకి దించింది వైఎస్సార్ పార్టీ..

ఒక వేళ నవీన్ నిశ్చల్, ఘని తమ సహకారం పూర్తిగా అందిస్తే ఆయన గట్టి అభ్యర్ది అవుతారు..వ్యక్తిగతంగా తమ తమ వర్గాలను కలిగి ఉన్న ఇరువురూ పూర్తిగా సహకరించారా లేదా అన్నది తెలియాల్సి ఉంది..ఇక్బాల్ గెలిస్తే ఇక భవిష్యత్తులో తమకు అవకాశాలు ఉండవనే లెక్కలతో నిశ్చల్ ఘనిలు హ్యాందిస్తే బాలయ్య గెలుపు నల్లేరు మీద నడకే అవుతుంది..అలా కాకుందా పార్టీని అధికారంలోకి తీసుకు రావాలని గట్టిగా అనుకొని నవీన్ నిశ్చల్ అబ్దుల్ ఘని లు సహకారం అందిస్తే హిందూపురం లో సంచలనం నమోదు కావొచ్చు..వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ది ఆర్ధికంగా అంత సత్తా కనిపించడం లేదని స్థానికులు అంటున్నారు..

బాలకృష్ణ ఆర్ధిక శక్తి ముందు ఇక్బాల్ సరిపొతాడా అనేది చాలా సులభంగా అర్దమవుతున్న విషయం..అన్నిటికీ మించి హిందూపురం ప్రజలకు అందుబాటులో ఉండరని ఆయన పిఏ లు రాజ్యం చలాయిస్తారని ఆయనను ఓడించడానికి తన వద్ద అస్త్రాలు ఉన్నయని కొన్ని రోజులుగా నవీన్ నిశ్చల్ ప్రకటిస్తూ వస్తున్నారు..అయితే ఆయనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కలేదు..కానీ పిఏ వ్యవహారం మాత్రం హిందూపురం నియోజకవర్గంలో పెద్ద చర్చనీయాంశం అయింది..దీంతో పాటు హిందూపురం నియోజకవర్గంలో బాలయ్య ప్రచారం చేయకుండా ఆయన సతీమణి ప్రచారం చేయడం బాలయ్యకు మరింత మైనస్ అయింది..

అయితే తాజాగా ఎన్నికల సందర్భంగా నియోజకవర్గాన్ని సందర్శించిన బాలయ్యకు వైఎస్సార్ పార్టీ అభిమానులు వ్యతిరేక నినాదాలు జై జగన్ నిన్నదాలు చేస్తూ చుక్కలు చూపించారు..దీంతో కోపొద్రిక్తుడైన బాలయ్య అక్కడి నుంచి వెంటనే నిష్క్రమించారు..హిందూపురం బాలయ్యకు చుక్కలు చూపించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో పెట్టండి..