జగన్ సుమంత్ స్నేహితుల దినోత్సవం రోజున ఏం చేశారో చూడండి సూపర్ జగన్

268

జీవితాన్ని అమ్మానాన్న ఇస్తారు, కాని ఆ దేవుడు మీకో అవకాశం ఇస్తాడు, మంచి స్నేహితుడ్ని మాత్రం మీరే ఎంచుకోవాలి అనే అవకాశం. మీ జీవితం మార్చేది కూడా మీరు చేసే స్నేహం అనే చెప్పాలి. జీవితంలో బంధుత్వాల కన్నా స్నేహితులకే విలువ ఇఛ్చేవారు చాలా మంది ఉంటారు….జీవితంలో ఎంత ఎత్తుకు వెళ్లినా సరే స్నేహితులని ఎవరూ మర్చిపోలేరు. సెలబ్రెటీ అయినా దోస్త్ దగ్గర మాత్రం ఫ్రెండ్ లాగానే ఉంటాడు. ధనవంతులు అయిన స్నేహితులు కూడా తమ స్నేహితులని జీవితంలో పైకి తీసుకువస్తారు, అయితే సాధారణ వ్యక్తుల గురించి పెద్ద పట్టించుకోకపోయినా, సెలబ్రెటీల విషయానికి వస్తే వారికి మంచి దోస్త్ ఎవరు అనేది మాత్రం అందరికి క్యూరియాసిటీ ఉంటుంది. ఈ సమయంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పుకోవాలి.

Image result for jagan and sumanth

అవును వైయస్ జగన్ కు అత్యంత ఆప్త మిత్రుడు, సీఎం జగన్మోహన్ రెడ్డి సరదాగా మామ అని పిలుచుకునే వ్యక్తి , సరదాగా మాట్లాడుకునే ఫ్రెండ్ ఎవరు అంటే వెంటనే చెప్పే పేరు సుమంత్,,, అక్కినేని సుమంత్ తనకంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. చిన్నతనం నుంచి సరదాగా ఉండే సుమంత్, హైదరాబాద్ బేగంపేట పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాడు.. ఈ సమయంలో సుమంత్ తో పాటు జగన్ కూడా క్లాస్ మేట్స్. ఇలా ఇద్దరూ స్కూలింగ్ అక్కడే చేశారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య ఎంతో స్నేహం ఉండేది క్లాస్ లో ఉన్న అందరిలో సుమంత్ తో ఎక్కువగా ఉండేవాడు జగన్.అంతేకాదు పార్టీలు బయటకు వెళ్లడం కూడా ఇద్దరూ వెళ్లేవారు.. ఎక్కడికైనా కలిసి వెళ్లేవారు. వీరిద్దరి మధ్య జరిగిన స్నేహం గురించి సుమంత్ కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఓ ఇంటర్వ్యూలో కూడా గతంలో చెప్పారు.

Image result for jagan and sumanth

సాయంత్రాలు చట్టపట్టాలేసుకుని తిరగడం.. పొద్దుపోయే దాకా.. ఎక్కడెక్కడో తిరిగి.. రాత్రవగానే దొడ్డిదారిన ఇంట్లోకి దూరే ప్రయత్నాలు చేయడం.. లాంటి తీపి గుర్తులన్నిఅప్పట్లో వీరి ఫ్రెండ్ షిప్ ఎంత స్ట్రాంగ్ అనేది చెబుతున్నాయి.. ఓరోజు 25ఏళ్ల క్రితం నాటి ఆ జ్ఞాపకాలను నెమరేసుకున్నారు సుమంత్. అప్పట్లో జరిగిన ఓ ఘటన గురించి చెబుతూ… ‘రాత్రి పొద్దుపోయి ఇంటికొచ్చాక.. దొంగచాటుగా పైనున్న బెడ్ రూమ్ కు వెళ్లేందుకు గ్రిల్ పట్టుకుని ఎక్కడానికి ప్రయత్నిస్తున్నాను. ఇంతలో తాతయ్య నాగేశ్వరరావు గారు చూడడంతో.. తాతా అతని పేరు జగన్మోహన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కొడుకు’ అంటూ జగన్ గురించి పరిచయం చేశానని చెప్పుకొచ్చాడు. మొత్తానికి ఆరోజుల్లో.. ఇద్దరం కలిసి చాలానే ఎంజాయ్ చేశామని చెప్పాడు సుమంత్. సుమంత్-జగన్ ల ఈ ‘దోస్త్ మేరా దోస్త్’ కహానీ అందరూ చెప్పుకున్నారు.

Image result for jagan and sumanth

ఇక జగన్ కాలేజీ చదువు ఫారెన్ వెళ్లడంతో కొన్ని రోజులు ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది ..తర్వాత మళ్లీ వ్యాపారాలు స్టార్ట్ చేసిన జగన్, సుమంత్ బెంగళూరులో కలిసేవారట, తర్వాత సుమంత్ కూడా సినిమాల్లో బిజీగా ఉండం వైయస్సార్ మరణం తర్వాత జగన్ రాజకీయాల్లోకి రావడం ఇవన్నీ కూడా ఇద్దరి మధ్య కొంత గ్యాప్ పెంచాయి.. కాని తర్వాత పర్సనల్ గా వారు కలవకపోయినా జగన్ సుమంత్ ఫోన్ చేసుకునేవారు.ఒకరికి ఒకరు మంచి స్నేహితులు ఇద్దరికి ఒకరు అంటే మరొకరికి చాలా ఇష్టం. ఇఫ్పటికీ సుమంత్ నేరుగా జగన్ కి కాల్ చేసి మాట్లాడతారు.. జగన్ ఆరోగ్యం గురించి ఆయన పాదయాత్ర సమయంలో సుమంత్ కూడా ఫోన్ చేసి మాట్టాడేవారు…విశాఖలో జగన్ పై దాడి జరిగిన సమయంలో జగన్ గురించి సుమంత్ ఆరా తీసారు.

అంతేకాదు పాదయాత్ర సమయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేతుల మీదుగా ‘ఇదం జగత్’ టీజర్ విడుదల చేశారు. ఈ చిత్రం సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు. హీరో సుమంత్, చిత్రయూనిట్ ఆహ్వనం మేరకు వైఎస్ జగన్ ఈ టీజర్‌ని ప్రేక్షకులకు అందించారు. వైఎస్ జగన్, హీరో సుమంత్ సాన్నిహిత్యంతోనే వైఎస్ హైదరాబాద్ వచ్చి టీజర్ విడుదల చేశారు. స్నేహితుడు సినిమా హిట్ అవ్వాలని కూడా కోరుకున్నాడు.. తాజాగా ఫ్రెండ్ షిప్ డే రోజున జగన్ సుమంత్ ఫోన్ చేసి మరీ విష్ చేసుకున్నారట.. జగన్ ఇలా మా ఇద్దరం ఎక్కువగా కలుసుకోకపోయినా చిన్నతనం నుంచి మా ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉందని లైఫ్ లాంగ్ ఇలానే ఉంటుంది అని చెబుతూ ఉంటారు ఇద్దరూ, స్నేహం స్నేహమే స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం, మరి మీకు కూడా లైఫ్ లో ఇలాంటి ధోస్త్ల్ లు ఉన్నారా, వారి గురించి కూడా కామెంట్ల రూపంలో చెప్పండి అలాగే విష్ చేయండి.