ఎన్నిక‌ల‌కు కీల‌క పిలుపునిచ్చిన జ‌గ‌న్

333

ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర‌లో భాగంగా విశాఖ‌లో ఉన్నారు …ఆయ‌న ఈ స‌మయంలో పార్టీ నాయ‌కులతో ఓ స‌మావేశం ఏర్పాటు చేశారు.. పార్టీనాయ‌కుల‌కు దిశానిర్దేశం చేసేలా కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. వ‌చ్చే ఎన్నిక‌ల‌పై పార్టీ కార్యాచరణపై నియోజకవర్గ సమన్వయకర్తలకు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులతో పార్టీ గురించి చ‌ర్చించారు.. మరో నాలుగు నుంచి ఐదు నెలల్లో ఎన్నికలు జరుగబోతున్నాయనే సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో. ఎన్నిక‌ల‌కు నాయ‌కులు అంద‌రూ సిద్దంగా ఉండాల‌ని ఆయ‌న తెలియ‌చేశారు.

ఇక జ‌న‌వ‌రి నాటికి మొత్తం బూత్ ల వారిగా కార్య‌క్ర‌మాలు పూర్తిచేయాల‌ని పాద‌యాత్ర‌లోనే, ఈ కార్య‌క్ర‌మాలు చేయాలి అని జ‌గ‌న్ తెలియ‌చేశారు..ప్రతీ అసెంబ్లీ సెగ్మెంట్లో సమన్వయకర్త.. ప్రతిరోజూ రెండు బూత్‌లలో పర్యటించి గడగడపనూ సందర్శించాలని జగన్‌ పేర్కొన్నారు. సెప్టెంబరు 17 నుంచి బూత్‌ల వారీగా కార్యక్రమాలు జరపాలని పిలుపునిచ్చారు. వారానికి ఐదు రోజుల పాటు ఆయా బూత్‌లకు చెందిన కార్యకర్తలు ఆయా కుటుంబాలతో మమేకం కావాలని ఆదేశించారు. ఈ కార్యక్రమాల్లో భాగం‍గా సమస్యలు, ఇతరత్రా అంశాలు గుర్తించాలన్న జగన్‌.. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రజల్లోకి వెళ్లేందుకు సమయం తక్కువగా ఉందని, ఇదే ఆఖరి అవకాశం కాబట్టి సద్వినియోగం చేసుకోవాలని తెలియ‌చేశారు. బూత్‌ కమిటీతో సమీక్ష చేసుకుని, ఓటర్ల జాబితాలో మార్పులు, సవరణలపై దృష్టి పెట్టాలన్నారు.

ఇక పార్టీ త‌ర‌పున న‌వ‌రత్నాల‌ను, ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లాల‌ని, వాటిపై ప్ర‌జ‌ల‌కు, మ‌న పార్టీ అధికారంలోకి వ‌స్తే ఎటువంటి ప‌థ‌కాలు అమ‌లు చేస్తాము అనేది తెలియ‌చేయాలని అన్నారు.. అలాగే పార్టీ త‌ర‌పున మ‌నం అధికార పార్టీ చేస్తున్న- అవ‌లంభిస్తున్న అవినీతిని ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లాల‌ని పిలుపునిచ్చారు. ఇక న‌వ‌ర‌త్నాల పోస్ట‌ర్ ను విడుద‌ల చేసిన జ‌గ‌న్, ఇది ప్ర‌తీ నాయ‌కుడు డౌన్ లోడ్ చేసుకుని, నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌జ‌ల్లోకి వెళ్లాలి అని పిలుపునిచ్చారు జ‌గ‌న్..