మొత్తానికి ఏపీకి స్పెషల్ స్టేటస్ ను సంపాదించినా జగన్..

216

ఢిల్లీ పర్యటనకు వెళ్లారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి. పర్యటనలో భాగంగా.. శుక్రవారం సాయంత్రం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. ఆయనను శాలువాతో సత్కరించి వెంకటేశ్వర స్వామి ప్రతిమను బహూకరించారు. అమిత్ షాతో భేటి అనంతరం నార్త్‌బ్లాక్‌ ఆవరణలో ముఖ్యమంత్రి జగన్ మీడీయాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌ విభజన హామీలతోపాటు రాష్ట్ర్రానికి ప్రత్యేక హోదా విషయంలో అమిత్ షాతో చర్చించానని ఆయన చెప్పారు. దేవుడి దయతో ప్రత్యేక హోదా వచ్చే వరకు… నేను వచ్చినప్పుడల్లా మరిచిపోకుండా ప్రతీ సందర్భంలోనూ అడుగుతూనే ఉంటా. ప్రత్యేక హోదాతోపాటు రాష్ట్ర విభజన చట్టంలో పేరొన్న హామీల అమలు హోం శాఖ పరిధిలో ఉంటుంది. అందుకే హోం మంత్రిని కలిశాను. ప్రత్యేక హోదా ఆవశక్యతను వివరించాను. అన్ని విధాలుగా ఇబ్బంది పడుతున్న రాష్ట్రానికి సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశాను అని జగన్ మీడియాకు తెలిపారు. ప్రత్యేక హోదా అవసరాన్ని తెలియజేస్తూ ఓ లేఖను కూడ అమిత్ షాకు అందించారు. అమిత్ షా కూడా ఈ విషయం గురించి మోడీతో మాట్లాడతానని, ఏపీకి స్పెషల్ స్టేటస్ వచ్చేలా చేస్తా అని అమిత్ షా హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇక మోడీ ప్రత్యేక హోదాపై చర్యలు తీసుకునేలా అమిత్ షా ప్రయత్నాలు చేయాలని కొరినట్టు ముఖ్యమంత్రి జగన్ తెలిపారు.

ఈ క్రింది వీడియో చూడండి

ఇక నీతీ ఆయోగ్ సమావేశంలో కూడ ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తుతామని ఆయన తెలిపారు. హోదా వచ్చే వరకు కేంద్రాపై ఒత్తిడి తెస్తుంటామని ఆయన స్పష్టం చేశారు. శనివారం నీతీ ఆయోగ్ సమావేశంలో పాల్గోనడంతో పాటు పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని కూడ నిర్వహించనున్నారు. ప్ర‌ధాని మోదీ అధ్య‌క్ష‌త‌న జ‌ర‌గ‌నున్న నీతి ఆయోగ్ స‌మావేశంలో త‌మ అభ్య‌ర్థ‌న‌ల‌ను వెల్ల‌డించ‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.మరోవైపు వైసీపీకి లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తామంటూ బీజేపీ ప్రతిపాదన చేసిందంటూ జరుగుతున్నప్రచారంపై జగన్ స్పందించారు. డిప్యూటీ స్పీకర్ పదవి ప్రతిపాదన ఏమీ రాలేదని.. లేనిపోనివి ఊహించుకోవద్దన్నారు. తాము ఆ పదవి కావాలని కోరలేదు.. వారు ఇస్తామనీ చెప్పలేదన్నారు. ఇప్పటి వరకు దానిపై ఎలాంటి చర్చ జరగలేదని క్లారిటీ ఇచ్చారు. ఇలాంటీ తప్పుడు వార్తలు ప్రచారం చేయవద్దని ఆయన మీడియాను కోరారు.

Image result for jagan

ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి నీతి అయోగ్ సమావేశంలో పాల్గొంటున్న జగన్ మోహన్ రెడ్డి.. ప్రత్యేక హోదాను, దాని అవసరం రాష్ట్రానికి ఎంత ఉందన్న విషయాన్ని వివరించే ప్రయత్నం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఆయన ప్రత్యేక వాదనను సిద్ధం చేసుకున్నారు. ఏపీకి హోదా ఇవ్వటం ద్వారా పొందే ప్రయోజనాల్ని ఏకరవు పెట్టటంతో పాటు విభజన కారణంగా ఏపీ ఎంతలా ఆదాయాన్ని నష్టపోయిందన్న విషయాన్ని గణాంకాల రూపంలో వివరించనున్నారు. హోదా మీద జగన్ వాదన ఎలా ఉండనుందంటే..

Image result for jagan
  • విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం తప్పనిసరిగా అవసరం. విభజన తరువాత వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయింది. ప్రగతి పరుగులో వెనుకంజలో ఉంది. తలసరి ఆదాయంలోనూ బాగా వెనుకబడింది.
  • 2015–16లో ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం రూ.8397 కాగా తెలంగాణ తలసరి ఆదాయం రూ.14411. అక్షరాస్యత.. మాతా శిశు మరణాలను నియంత్రించడంలోనూ ఏపీ వెనుకబాటులో ఉంది. గత కొన్నేళ్ల గణాంకాలను పరిశీలిస్తే పంటల బీమా ప్రీమియం కింద చెల్లిస్తున్న సొమ్ము పరిహారంగా ఇస్తున్న సొమ్ము కంటే ఎక్కువగా ఉంటోంది.
Image result for jagan
  • దీన్ని సరిచేయడానికి కేంద్రం చెల్లించే ప్రీమియం వాటాను రాష్ట్రానికి గ్రాంట్గా ఇచ్చేస్తే రాష్ట్ర సర్కారు రైతులకు న్యాయం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించిన తరువాత ఆ పంటల ప్రొక్యూర్మెంట్లో ఆంక్షలు విధించరాదు.
  • మొత్తం పంటలను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలి. రైతుల ఖాతాలకు ప్రభుత్వం బదిలీ చేసే సొమ్మును పాత బకాయిల కింద బ్యాంకులు సర్దుబాటు చేయకుండా తగిన చర్యలు తీసుకోవాలి. వ్యవసాయ ఆధారిత రాష్ట్రమైన ఏపీలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు ప్రోత్సాహం ఇవ్వాలి.
  • తయారీ రంగంలో ఆంధ్రప్రదేశ్ వాటా జాతీయ సగటు వాటాతో పోల్చి చూస్తే చాలా తక్కువగా ఉంది. యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలంటే తయారీ రంగాన్ని అభివృద్ధి చేయాలి. సూక్ష్మ మధ్యతరహా పరిశ్రమల క్లస్టర్ల ఏర్పాటుకు జాతీయ స్థాయిలో ఒక విధానాన్ని తీసుకురావాలి. అనే అంశాలకు ఈ నీతి ఆయోగ్ మీటింగ్ లో చర్చించనున్నారు. మరి జగన్ ఢిల్లీ పర్యటన గురించి అలాగే అమిత్ షాతో జరిగిన మీటింగ్ గురించి చర్చించిన విషయాల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.