మోదీ ట్రాప్ లో ప‌డింది జ‌గ‌న్ ఆ బాబా ?

470

అవిశ్వాస తీర్మానం విష‌యంలో ఇప్ప‌టికీ తెలుగుదేశం పార్టీ వైసీపీలు చ‌ర్చ చేసుకుంటున్న విష‌యం తెలిసిందే.. ఇటు తెలుగుదేశం పై ప్ర‌ధాని చేసిన వ్యాఖ్య‌లు, ఆ ట‌ర్నింగులు యూట‌ర్న్ లు అనే విష‌యాల‌లో వీరు మ‌రింత మ‌ద‌న‌ప‌డుతున్నారు… పార్టీ అధినేత పై చేసిన కామెంట్ల పై కాస్త ఘాటుగానే ఉంటున్నారు సైకిల్ పార్టీ నేత‌లు … ఇటు వైసీపీని ఏమీ అన‌లేక బీజేపీని విమ‌ర్శించ‌లేక స‌త‌మ‌త‌మ‌వుతున్న వారు ఉన్నారు.. ఎందుకు అంటే గ‌తంలోనే ప్యాకేజీని స్వాగ‌తించి అర్ధ‌రాత్రి మీడియా ముందు మీటింగ్ పెట్టి, కేంద్రానికి ప్ర‌ధానికి ఆర్ధిక మంత్రికి ధ‌న్య‌వాదాలు తెలిపారు.. మ‌రి ఇప్పుడు కాదు అంటే ఎలా అని వైసీపీ కూడా ప్ర‌శ్నిస్తోంది.

Image result for modi jagan

ఇక బీజేపీ పై తెలుగుదేశం అధినేత ఎదురుదాడి మొద‌లుపెట్టారు.. నేను ఏనాడు ప్ర‌త్యేక ప్యాకేజీకి ఒప్పుకోలేదు అని అన్నారు ఆయ‌న‌… ప్ర‌ధాని నరేంద్ర‌మోడీ వైసీపీ ట్రాప్ లో ప‌డ్డారు అని ఆయ‌న విమ‌ర్శించారు. ఢిల్లీలో ఉండి తెలుగువాడి సత్తా చూపిస్తామని చెప్పిన చంద్రబాబు. టీడీపీ ఎంపీలు మాత్రం రాజీనామా చేయరని అన్నారు. అన్ని పార్టీలను కలుపుకొని కేంద్రంపై పోరాటం చేస్తామని చెప్పారు.

Related image

ఎవ‌రు ఏమీ అనుకున్నా తెలుగువాడి స‌త్తా చూపిస్తాం కేంద్రంతో పోరాడుతాం అని మళ్లీ ఘంటాప‌దంగా చెప్పారు సీఎం చంద్ర‌బాబు.. ఇటు వైసీపీ ప్ర‌శ్నిస్తున్నా, సోష‌ల్ మీడియాలో మాత్రం ఆనాడు థ‌న్య‌వాదాలు తెలిపిన వీడియోలు పేప‌ర్ క‌టింగ్స్ వైర‌ల్ అవుతున్నాయి.. కేంద్రానికి ధ‌న్య‌వాదాలు, ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీకి అలాగే కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీకి తెలియ‌చేశారు..

Image result for modi babu

ఇక వైసీపీ ముందు నుంచి ఒకే నినాదంతో ఉండ‌టం ప్ర‌త్యేక హూదాపై పోరాటం చేయ‌డంతో ప్ర‌జ‌ల నుంచి వ్య‌తిరేక‌త వ‌స్తుంది అని భావించి వెంట‌నే బాబు కూడా యూట‌ర్న్ తీసుకున్నారు… ఇక కేంద్రం పై మొద‌ట అవిశ్వాసం పెట్ట‌డానికి వ‌చ్చింది కూడా వైసీపీ, ఇక్క‌డ కూడా బాబు వెంట‌నే త‌మ ఎంపీల‌తో అవిశ్వాసానికి ముందుకు వ‌చ్చారు..