ఐటి- విచార‌ణ‌కు రేవంత్ ఆస‌క్తిక‌ర‌పరిణామం

262

కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిపై అక్ర‌మాస్తుల కేసు విష‌యంలో ఆయ‌న విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు.. ఇప్ప‌టికే నాలుగు రోజుల‌గా ఆయ‌న ఇంటిపై కార్యాల‌యాల‌పై ఆయ‌న అనుచ‌రుల ఇళ్ల‌పై సోదాలు జ‌రుగుతున్నాయి. ఇక ఈ స‌మ‌యంలో కొడంగ‌ల్ తో పాటు ఆయ‌న కార్యాల‌యాలు ఎక్క‌డ ఉన్నా అక్క‌డ సోదాలు జ‌రిగాయి.. ఉద‌య‌సింహ సెబాస్టియ‌న్ ల‌ను కూడా ప్ర‌శ్నించ‌నున్నారు ఆధాయ‌ప‌న్నుశాఖ అధికారులు.

Image result for revanth reddy

రేవంత్ ఇంట్లో దొరికిన కీలక పత్రాలు డబ్బుకు సంబంధించి ప్రశ్నించనున్న ఐటీ.. ఓటుకు నోటు వ్యవహారంలో రేవంత్ ను విచారించనున్నారు. రేవంత్ ఇంట్లో డాకుమెంట్స్, లాకర్లపై ప్రశ్నించి.. స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోనున్నారు ఐటి అదికారులు. ఓటుకునోటు వ్య‌వ‌హారం తాజాగా వ‌చ్చిన ఐటీ లెక్క‌లు తేడాలు అన్నీంటిని ప్ర‌శ్నించ‌నున్నారు అని తెలుస్తోంది.

Image result for revanth reddy

రేవంత్ రెడ్డి, ఆదాయ, వ్యయాలతో పాటు, కంపెనీలు లావాదేవీలు, విదేశాల పెట్టుబడులపై ఆరా తీయనున్నారు. ఎమ్మెల్సీ స్టీఫెన్‌సన్‌కు ఇవ్వజూపిన రూ.50 లక్షల గురించే ప్రధానంగా ఆరా తీయనున్నారు. మ‌రి దీనిపై రేవంత్ ఎటువంటి స‌మాధానం చెబుతారు అనేది చూడాలి. అలాగే రేవంత్ పై ఇప్ప‌టికే వ‌చ్చిన ఆరోప‌ణ‌లు అన్ని కుట్ర‌పూరితం అని, త‌న‌పై కావాల‌నే ఇలా నేరాలు అభియోగాలు మోపుతున్నారు అని ఆయ‌న అన్నారు.