బాబు పై బీజేపీ ప్లాన్ ఇదేనా

411

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబుతో చెలిమి- మిత్ర‌బంధం తొల‌గించుకుంది బీజేపీ.. ఇక కేంద్రంలో ఇద్ద‌రు మంత్రులు రాజీనామా చేశారు. ఆ వెంట‌నే రాష్ట్రంలో ఇద్ద‌రు మంత్రులు రాజీనామా చేశారు.. ఇప్పుడు బీజేపీ తెలుగుదేశం అంటే నిప్పుల కొలిమి అనే చెప్పాలి.. ఆజ్యం పోసే విధంగా ఎవరైనా కామెంట్లు చేస్తుంటే అలాగే వివాదాల‌ల‌తో మ‌రింత విమ‌ర్శ‌ల‌తో మారిపోతోంది ఈ రెండు పార్టీల రాజకీయం.. తెలుగుదేశం పార్టీ మ‌రీ ముఖ్యంగా ఈ విమ‌ర్శ‌లు త‌ట్టుకోలేక బీజేపీ పై విమ‌ర్శ‌లు మ‌రింత పెంచుతున్నారు… బీజేపీ కూడా కేంద్రంలో అధికారంలో ఉంట‌డంతో వారు కూడా విమ‌ర్శ‌లు పెద్ద ఎత్తున చేస్తున్నారు…

Image result for modi

సీఎం నుంచి చిన్న‌స్ధాయి ఉద్యోగి వ‌ర‌కూ అవినీతి తాండ‌వం చేస్తోంది అని విమ‌ర్శ‌లు చేస్తున్నారు.. మ‌రి తెలుగుదేశం విమ‌ర్శ‌లు బీజేపీ ప్ర‌తివిమ‌ర్శ‌ల‌తో రోజూ వివాదాలు పెరుగుతూనే ఉన్నాయి ఇక క‌న్నా ఏపీ బీజేపీ అధ్య‌క్షునిగా వ‌చ్చిన త‌ర్వాత ఈ వార్ మ‌రింత పెరిగింది అనే చెప్పాలి…. బాబుపై కేసులు పెడ‌తారా,స‌ర్కారు అవినీతిపై కేంద్ర విచార‌ణ సంస్ద‌ల‌తో విచార‌ణ జ‌రుపుతారా అనే విధంగా చ‌ర్చ‌లు అయితే జ‌రుగుతున్నాయి.తాజాగా బీజేపీ ఈ విష‌యం పై ఓ క్లారిటీ అయితే ఇచ్చింది..త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబుపై చార్జిషీటు తీసుకువస్తున్నాం అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధరరావు తెలియ‌చేశారు.

Image result for tdp

ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనకు వచ్చిన ఆయన ఈ విష‌యంపై మాట్లాడారు. చంద్రబాబు పాలనలో అవినీతి బాగా పెరిగిపోయిందని అన్నారు. ఈ విష‌యాలు అన్నింటిపై బీజేపీ వివరాలు సేకరిస్తోందన్నారు. వాటన్నింటినీ ప్రజల ముందుకు తీసుకొస్తామని చెప్పారు. బీజేపీ గ‌తంలో ఇచ్చిన హామీలు అన్నీ నెర‌వేర్చింది అని, ఆ హామీలు నెర‌వేరాకే 2019 ఎన్నిక‌ల్లో తాము ఓట్లు అడుగుతాము అని చెబుతున్నారు బీజేపీ నాయ‌కులు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోరాడేందుకు ఎన్టీఆర్‌ పార్టీని స్థాపించారని అటువంటి పార్టీతో టీడీపీ జత కడుతోందని విమర్శించారు. మొత్తానికి బీజేపీ ఏపీపై మంచి ప్లాన్ లో ఉంది అనేది తెలుస్తోంది.