ఆ ఒక్క మాట‌కే బాబు టెన్ష‌న్ ప‌డుతున్నారు ?

437

కేంద్రంతో నాలుగు సంవ‌త్స‌రాలు క‌లిసి ప‌నిచేసిన తెలుగుదేశం పార్టీ ప్ర‌త్యేక హూదా కాద‌ని ప్ర‌త్యే ప్యాకేజీకి ఒప్పుకుని, ఇప్పుడు వైసీపీ ప్ర‌త్యేక హూదా కోసం పోరాడుతోంది అని, యూట‌ర్న్ తీసుకుంది అని వైసీపీ విమ‌ర్శిస్తోంది.. ఎక్క‌డిక‌క్క‌డ వైసీపీ నాయ‌కులు నేటి బంద్ లో భాగంగా విజ‌య‌వంతం చేస్తున్నారు.. ఇక వైసీపీ నాయ‌కులు తెలుగుదేశం నాయ‌కుల‌పై విమ‌ర్శ‌ల బాణాలు ఎక్కుపెడుతున్నారు..

Image result for chandra babu sad

 

బీజేపీ నుంచి టీడీపీ బ‌య‌ట‌కు వ‌చ్చినా బీజేపీ నాయ‌కుల‌ను తెలుగుదేశం నాయ‌కులు పొగుడుతారు.. అలాగే తెలుగుదేశం నాయ‌కుల‌ను బీజేపీ నాయ‌కులు పొగుడుతున్నారు.. దీనికి నిద‌ర్శ‌నం మ‌న‌కు తెలిసిందే అంటున్నారు… తాజాగా కేంద్రహూం మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా, బాబు మా మిత్రుడే అని అన్నారు పార్ల‌మెంట్ లో.. దీంతో అర్ధ‌మైంది క‌దా బీజేపీ- టీడీపీ ఇంకా మైత్రిలో ఉన్నాయి అని అంటున్నారు నాయ‌కులు.

ఇక బీజేపీ వైసీపీ క‌లిసి ఉన్నాయి అని కామెంట్లు చేసే తెలుగుదేశం నాయ‌కులు, పార్లమెంటు సాక్షిగా చంద్రబాబు నాయుడు తమ మిత్రుడేనని కేంద్ర హోంమంత్రి, బీజేపీ నేత రాజ్‌నాథ్‌ సింగ్ చెప్పిన మాట మ‌రోసారి వినాలి అని అంటున్నారు.. ఇక ప్ర‌తీ విష‌యాన్ని ఆరోప‌ణ‌ల‌ను ఖండించే సీఎం చంద్ర‌బాబు , రాజ్ నాథ్ చేసిన వ్యాఖ్య‌ల‌ను ఎందుకు ఖండించ‌లేదు, మ‌రి ఇది మిత్ర‌బంధం కాదా మిత్ర‌వైఖ‌రి కాదా అని వైసీపీ ప్ర‌శ్నిస్తోంది.

తెలుగుదేశం ఆ నాడు ప్ర‌త్యేక ప్యాకేజీకి ఒప్పుకుంది.. ఇప్పుడు మ‌ళ్లీ కొత్త భాష్యాలు ప‌లుకుతోంది అని విమ‌ర్శిస్తున్నారు. …ఇక ఈ మాట‌లు ఆనాడు ఖండించి ఉంటే బాగుండేది ఇప్పుడు విమ‌ర్శ‌ల త‌ర్వాత ఖండించినా ప్ర‌యోజ‌నం ఉండ‌దు అని టీడీపీ కేడ‌ర్ భావిస్తోంది. మొత్తానికి ఈ విషయంలో బాబు కాస్త డైల‌మాలో ఉన్నార‌ట‌.