చంద్ర‌బాబు ఆలోచ‌న ఈ జిల్లాలో క‌రెక్ట్ అవుతుందా ?

428

తెలుగుదేశం పార్టీ గత ఎన్నిక‌ల్లో ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో 15 సెగ్మెంట్ల‌కు 15 సెగ్మెంట్ల‌లో విజ‌యం సాధించింది.. ఇక్క‌డ వైసీపీ గ‌త ఎన్నికల్లో దారుణ‌మైన ప‌రాభ‌వాన్ని చ‌విచూసింది ..దీంతో జిల్లాలో వైసీపీ క్ర‌మ‌క్ర‌మంగా త‌న స్టామినా నిరూపించుకోవాలి అని చూసింది.. ఈ నాలుగు సంవ‌త్స‌రాలుగా.. ఇక జిల్లాలో 15 సెగ్మెంట్లట‌లో ఆరు కాపు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి.. గ‌త ఎన్నిక‌ల్లో తెలుగుదేశం అధినేత కూడా కాపుల‌కు ఇక్క‌డ అధికంగా ప్ర‌యారిటీ ఇచ్చి సీట్లు ఇచ్చారు.. ఇటు తూగోలో కాపు క‌మ్యూనిటీ ఎలా ఉన్నారో ప‌శ్చిమ‌లో కూడా కాపు క‌మ్యూనిటి అధికంగా ఉన్నారు.

Image result for chandra babuగ‌త ఎన్నికల్లో వైసీపీ టిక్కెట్లు చివ‌రి నిమిషంలో ఇచ్చింది… దీంతో ఇక్క‌డ వైసీపీకి అధికంగా ఈ విష‌యం మైన‌స్ అయింది… కొంద‌రు అప్ప‌టిక‌ప్పుడు కాంగ్రెస్ నుంచి వ‌చ్చిన వారికి మాత్ర‌మే టిక్కెట్లు ఇచ్చారు జ‌గ‌న్.. విజ‌యం క‌చ్చితం అనుకున్న పాల‌కొల్లు, న‌ర్సాపురం, త‌ణుకు ఓట‌మికి వైసీపీ చేతులారా చేసుకున్న ప‌ని అంటారు… ఇక తెలుగుదేశం ముందు నుంచి ఎవ‌రు అభ్య‌ర్దులు అనుకుందో వారికి టికెట్ ఇచ్చి వారిని గెలిపించుకుంది. అలాగే ఏలూరు -న‌ర‌సాపురం ఎంపీ స్ధానాలు గెలుచుకుంది..

Image result for chandra babu

తెలుగుదేశం పార్టీ గ‌త ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీల్లో కాపు రిజ‌ర్వేష‌న్ల గురించి చ‌ర్చించుకుంటున్నారు.. ఇటు పోలవ‌రం ప‌ట్టిసీమ ప్రాజెక్టుల విషయంలో తెలుగుదేశం ఇచ్చిన హామీని నెర‌వేర్చుకుంది. పోల‌వ‌రం ప‌నులు జ‌రుగుతున్నాయి…. జిల్లాలో తెలుగుదేశం పార్టీ త‌ర‌పున కేడ‌ర్ 15 సెగ్మెంట్ల‌లో అలాగే బ‌లంగా ఉన్నారు.. ఇటు జిల్లాలో కాపుల‌ను ఆక‌ర్షించేందుకు జిల్లాలో మ‌ర‌లా తెలుగుదేశం అధినేత కొత్త‌ ప్లాన్ వేయ‌బోతున్నారు… ఇటు కొత్త‌ప‌ల్లికి కాపు కార్పొరేష‌న్ ప‌ద‌వి ఇచ్చారు, అలాగే తూగోలో మంత్రి చిన‌రాజ‌ప్ప‌కు హూంమంత్రి ప‌ద‌వి ఇచ్చారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో రెండు జిల్లాలో మంత్రి ప‌ద‌వులు కాపుల‌కు ఇచ్చేలా చూస్తున్నారు… మొత్తానికి కాపు ఓటు బ్యాంకు ఈ రెండు జిల్లాలో పార్టీల భ‌విష్య‌త్తును తేల్చనుంది.