బయటపడ్డ వివేకా వీలునామా.. ఆస్తులు ఎవరికి రాశాడో తెలిసి షాకైన జగన్

612

వైసీపీ నేత, మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. వివేకా హత్య తర్వాత నుంచి కనిపించకుండా పోయిన ఆయన సన్నిహితుడు పరమేశ్వర్ రెడ్డి పేరు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. అతడు అనారోగ్యంతో తిరుపతిలోని సంకల్ప ఆసుపత్రిలో చేరినట్టు గుర్తించారు. అయితే, తనకు వివేకా హత్యతో ఎలాంటి సంబంధం లేదని పరమేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. అంతేకాదు, హత్య జరిగిన రోజు వివేకా ఇంటి తలుపు తీసినవాళ్లే హత్య చేసి ఉంటారని ఆయన పేర్కొన్నారు. వివేకా హత్య ఇంటి దొంగల పనే అయ్యుంటుందని, వారే అతడి ప్రాణాలు బలిగొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Image result for ys vivekananda reddy letter

అలాగే ప్రధాన నిందితులుగా భావిస్తున్న గంగిరెడ్డి, పరమేశ్వర్ రెడ్డి కాల్ డేటాలో కొంతమంది టీడీపీ నేతల పేర్లు కూడా ఉన్నాయని గుర్తించిన అధికారులు, వారిని కూడా ప్రశ్నించే అవకాశం ఉంది. వివేకా గుండెపోటుతో మరణించారని తొలుత చెప్పి మీడియాను, బంధువులను తప్పుదారి పట్టించింది కూడా గంగిరెడ్డేనని భావిస్తున్నారు. వివేకా గుండెపోటుతో ఆయన మరణించారని ఆయన పీఏ కృష్ణారెడ్డి ద్వారా అవినాష్ రెడ్డికి చెప్పించారని, ఘటనాస్థలికి రాకుండా, మృతదేహాన్ని చూడకుండా కొందరు కుటుంబసభ్యులు అదే విషయాన్ని చెప్పారని సిట్ అధికారులు ధ్రువీకరించారు. అలాగే వివేకా రెండవ భార్య ఉదంతం కూడా బయటకు వచ్చింది. అతనికి ఒక ముస్లిం అమ్మాయితో రెండవ పెళ్లి అయ్యిందని ఒక కొడుకు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. సిట్ అధికారులు చాలా వేగవంతంగా ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.

ఈ క్రింది వీడియో చూడండి

ఈ విషయాలన్నీ ఇలా ఉంటె ఇప్పుడు వివేకా వీలునామా బయటపడింది. వయసు దగ్గర పడడంతో ఆయన వీలునామా ముందుగానే రాసి ఉంచాడు. ఆయనకు పెద్దగా ఆస్తులు ఏమి లేవు. పులివెందులలో వారసత్వంగా వచ్చిన ఇల్లు ఉంది. అలాగే పులివెందులలో ఒక పెద్ద అపార్ట్ మెంట్ ఉంది. హైదరాబాద్ లో ఒక ఇల్లు అపార్ట్ మెంట్ అలాగే బెంగుళూర్ లో ఒక ఇల్లు ఉంది.వీటితో పాటు వారసత్వంగా పులివెందులలో పొలాలు ఉన్నాయి. ఇవి తప్పా ఆయనకు ఏమి ఆస్తులు ల;లేవు. అయితే ఆ ఆస్తులు తన పిల్లలకు చెందేలా రాశాడు. ఆయనకు ఒక కూతురు మాత్రమే ఉన్నారు. అయితే ఇప్పుడు రెండవ భార్య అని ఒక ముస్లిం యువతీ వచ్చింది. అయితే వాళ్ళు పెళ్లి చేసుకున్నారో లేదా అనేది దర్యాప్తులో తేలుతుంది. ఒకవేళ ఆమెను కూడా పెళ్లి చేసుకున్నట్టు అయితే ఆమెకు ఒక కొడుకు ఉన్నాడు. కాబట్టి ఈ ఆస్తిలో కొంతభాగం ఆ వారసుడికి కూడా దక్కుతుంది. మరి వివేకానంద వీలునామా గురించి ఆయన ఆస్థి పాస్తుల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.