వాజ్ పేయి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమం..

350

భారత మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజ్ పేయి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది..ఆయన వయసు 93 సంవత్సరాలు..ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితిపై బీజేపీ శ్రేణుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆయనను ప్రధాని నరేంద్రమోదీ గురువారం మరోసారి పరామర్శించారు. మరోవైపు బీజేపీ అగ్రనేతలు కూడా పెద్ద ఎత్తున ఎయిమ్స్‌ తరలి వస్తున్నారు. ఈ నేపధ్యంలో బిజెపి రాష్ట్రాల ముఖ్యమంత్రులు డిల్లీ చేరుకుంటున్నారు..

ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న మాజీ ప్రధాని వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా గురువారం సాయంత్రం మీడియాకు తెలిపారు. అంతకుముందు వాజ్‌పేయిని పరామర్శించిన కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కూడా వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉందని రాజ్‌నాథ్‌ మీడియాకు తెలిపారు. ఇక, మరికాసేపట్లో ఎయిమ్స్‌ వైద్యులు హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేయనున్నారు.